ధృవ నక్షత్రం మూవీ కథను మొదట వేరే హీరోలకు చెప్పానని అనివార్య కారణాల వల్ల ఆ హీరోలు ఈ సినిమాను రిజెక్ట్ చేశారని గౌతమ్ మీనన్ వెల్లడించారు. వాళ్ల అభిప్రాయాన్ని నేను అర్థం చేసుకున్నానని అందువల్ల వాళ్లు రిజెక్ట్ చేసినా నేను బాధ పడలేదని గౌతమ్ మీనన్ పేర్కొన్నారు. అయితే ఈ కథకు సూర్య నో చెప్పడాన్ని మాత్రం నేను తట్టుకోలేకపోయానని ఆయన చెప్పుకొచ్చారు. అది నన్నెంతో బాధించిందని గౌతమ్ మీనన్ వెల్లడించారు.
ధృవ నక్షత్రం మూవీ రిలీజ్ కోసం నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఆ సినిమాను తప్పకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని గౌతమ్ మీనన్ వెల్లడించారు. ఎన్నో సంవత్సరాల క్రితం తెరకెక్కించినా ప్రేక్షకులు ఏ మాత్రం బోర్ గా ఫీల్ కారని ఆయన అన్నారు. ఈ సినిమా కథను పాత కథ అనుకోరని ఈ సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నానని ఆయన తెలిపారు.
ధృవ నక్షత్రం మూవీ ఏడు సంవత్సరాల క్రితమే షూటింగ్ ను పూర్తి చేసుకోగా ఆర్థిక సమస్యలు ఈ సినిమాకు శాపంగా మారాయి. ఈ సినిమా రిలీజ్ వాయిదా పడటంపై గౌతమ్ మీనన్ వేర్వేరు సందర్భాల్లో అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. నాకు ఎక్కడికైనా వెళ్లిపోవాలని అనిపిస్తోందని అయితే పెట్టుబడిదారులకు జవాబు చెప్పాలని నేను ఆగిపోతున్నానని ఆయన కామెంట్లు చేశారు. ధృవ నక్షత్రం మూవీ థియేటర్లలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాల్సి ఉంది.