అయితే ఒకప్పుడు మాత్రం నయనతార తన కెరియర్ లో సెటిల్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడింది . అవకాశాల కోసం చాలా ట్రై చేసింది. కాగా ఇదే మూమెంట్లో 'యోగి' సినిమా ఆఫర్ రావడంతో ఆమె హ్యాపీగా ఫీల్ అయింది .ప్రభాస్ లాంటి ఒక హీరో సరసన నటిస్తే తన కెరియర్ బాగవుతుంది అంటూ ఆశపడింది. అయితే సడన్గా ఏమైందో ఏమో కానీ యోగి సినిమాలో ఆఫర్ వచ్చినట్లే వచ్చి చేయి జారిపోయింది . ఆ మూమెంట్లో నయనతారకు ఇండస్ట్రీలో జరిగిన పెద్ద 'గేం చేంజింగ్' గురించి అర్థమైంది .
ఆమెను కాకుండా ఆ ప్లేస్ లో వేరే మరో హీరోయిన్ ని పెట్టాలి అనుకుంటున్నారు అంటూ ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే స్టార్ హీరో ప్రభాస్ కి కాల్ చేసి మరి "అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది..? నన్ను హీరోయిన్గా ఫిక్స్ చేసి ..అగ్రిమెంట్ పై సైన్ చేయించి..? రెండు మూడు సీన్స్ తెరకెక్కించి.. వేరే హీరోయిన్ ని పెట్టుకుంటే ఎలా..? అంటూ ఎమోషనల్ గా ఏడ్చేసిందట ". ప్రభాస్ కూడా అలాంటిది ఏదీ లేదు అంటూనే సర్ది చెప్పడానికి ట్రై చూసిన నయనతార మాత్రం ఏ రకంగా వినలేదట . దీంతో డైరెక్టర్ రంగంలోకి దిగి ఆమెనే ఈ సినిమాలో హీరోయిన్గా మళ్లీ చూస్ చేసుకున్నారట. అప్పట్లో ఈ వార్త బాగా సెన్సేషనల్ గా మారింది. ఇప్పుడు సౌత్ ఇండియాలోనే క్రెజీయస్ట్ హీరోయిన్గా మారిన తర్వాత నయనతారకు సంబంధించిన ఈ వార్త మరొకసారి ఇండస్ట్రీలో హీట్ పెంచేస్తుంది..!!