కెరియర్ స్టార్టింగ్ లో ఫుల్ ఫ్లాప్స్ అందుకొని అసలు ఈ హీరోయిన్ గా ఇండస్ట్రీలో సెటిల్ అవుతుందా..? అవ్వదా..? అన్న మాటల దగ్గర నుంచి ఇండస్ట్రీకి ఇలాంటి హీరోయిన్ నే కావాలి అన్న కామెంట్స్ దక్కించుకునే స్థాయికి ఎదిగిపోయింది. ఆఫ్ కోర్స్ ప్రజెంట్ పరిస్థితి వేరేలా ఉంది. అది వేరే మ్యాటర్ . అయితే పూజా హెగ్డే అని అందరూ ముద్దుగా బుట్ట బొమ్మ అంటూ పిలుచుకుంటూ వచ్చేవారు. ఆమె గురించి ఏమి చెప్పాలి అన్న.. ఏం మాట్లాడాలి అన్న ..టాలీవుడ్ ఇండస్ట్రీ బుట్ట బొమ్మ అంటూ ఆమె పేరు ముందు బుట్ట బొమ్మ అనే ట్యాగ్ ని కచ్చితంగా ఉపయోగించేవారు .
అయితే ప్రజెంట్ మాత్రం ఆ బుట్ట బొమ్మ ట్యాగ్ వేరే హీరోయిన్ ఖాతాలో పడిపోయింది. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. రీసెంట్గా బ్యాక్ టు బ్యాక్ బడాబడా సినిమాలతో హిట్ అందుకుంటున్న మీనాక్షి చౌదరి పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది . 'ఇచట వాహనములు నిలుపరాదూ అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. రీసెంట్ గానే 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది .
అంతేకాదు మీనాక్షి తన పర్ఫామెన్స్ కి హై లెవెల్ ప్రశంసలు కూడా దక్కించుకుంటూ వస్తుంది. కాగా ఇప్పుడు మీనాక్షి చౌదరికి 'బుట్ట బొమ్మ' అనే ట్యాగ్ ఇచ్చేశారు జనాలు. ఒకప్పుడు పూజ హెగ్డే ప్లేస్ ని ఆమె ఇప్పుడు రీప్లేస్ చేసింది అని.. కెరియర్ మొదట్లో ప్రాబ్లమ్స్ అందుకున్న మీనాక్షి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని క్రేజీయస్ట్ హీరోయిన్గా మారిపోయింది అని.. ఇక మీనాక్షి చౌదరిని బుట్ట బొమ్మ అని పిలవాల్సిందే అంటూ ఆమె ఫ్యాన్స్ ఆ విధంగా కామెంట్స్ పెడుతున్నారు . దీంతో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో మీనాక్షి చౌదరి పేరు హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది..!