సీనియర్ ఎన్టీఆర్ నటుడిగా.. రాజకీయ నాయకుడిగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాడు అని చెప్పుకోవచ్చు. నటనలో అయినా రాజకీయాల్లో అయినా ఈయనకు ఈయనే సాటి అని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి సీనియర్ ఎన్టీఆర్ తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు రెండో పెళ్లి చేసుకోవడమే. తన మొదటి భార్య బసవతారకం మరణించడంతో లక్ష్మీపార్వతి మాయలో పడిపోయారు.. ఆయన జీవితానికే ఇది ఒక మాయని మచ్చగా మారిపోయింది. అయితే అలాంటి లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నాక తన పార్టీలో ఉన్న రాజకీయ నాయకులతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా ఆయనను వెలివేశారు. ఇంట్లో వాళ్ళు కూడా ఆయనను దూరం పెట్టేసరికి ఆ బాధను ఆయన దిగిమింగుకోలేకపోయారు.

 చాలామంది రెండో పెళ్లి విషయంలో ఈయన్ని వేలెత్తి చూపడంతో ఎంతో కృంగిపోయారు. అదే సమయంలో సీనియర్ ఎన్టీఆర్ ఓడిపోవడం ఆయన కుంగి పోవడానికి మరో కారణం అయింది. దాంతో ఆ బాధ తట్టుకోలేని సీనియర్ ఎన్టీఆర్ మరణించారని చెప్పుకోవచ్చు. అయితే ఓ మీడియా సమావేశంలో హరికృష్ణ సీనియర్ ఎన్టీఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.. సీనియర్ ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నాక పిల్లల కోసం స్టెరాయిడ్స్ తీసుకున్నారు. 72 ఏళ్ల వయసులో ఆయన స్టెరాయిడ్స్ తీసుకోవడం అంత మంచిది కాదు. దాని వల్లే ఆయన కి ఓసారి హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చింది. అలాంటి ఇంజక్షన్స్ తీసుకోవద్దని డాక్టర్లు చెప్పారు. కానీ ఆయన మాత్రం వినకుండా అలాంటి పని చేశారు.. అంటూ మీడియాతో ఓసారి హరికృష్ణ చెప్పుకొచ్చారు.

అంతే కాదు లక్ష్మి పార్వతి గురించి కూడా మాట్లాడుతూ.. లక్ష్మీపార్వతి కూడా  ఆ ఏజ్ లో రీకనాలైజేషన్ ( మళ్లీ పిల్లలు పుట్టేలా) ఆపరేషన్ చేయించుకుంది. అంటూ చెప్పారు. అయితే హరికృష్ణ మాటలు వింటుంటే రెండో భార్యతో పిల్లల కోసం సీనియర్ ఎన్టీఆర్ స్టెరాయిడ్స్ తీసుకోవడంతో పాటు లక్ష్మీపార్వతి మళ్లీ పిల్లల కోసం ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది.కానీ వీరికి పిల్లలు పుట్టలేదు. ఇక 72 ఏళ్ల ఏజ్ లో సీనియర్ ఎన్టీఆర్ అలాంటి స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్లే ఆయన ఆరోగ్యానికి ప్రమాదం అయ్యి మరణించారు అన్నట్లుగా హరికృష్ణ మాట్లాడారు. అలా పరోక్షంగా తండ్రి మరణానికి లక్ష్మీపార్వతి కారణం అని చెప్పకనే చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: