ఒకప్పుడు పరిస్థితి వేరు.. ఇప్పటి పరిస్థితి వేరు.. ఇండస్ట్రీలో సిచువేషన్ మొత్తం మారిపోయింది . ఒకప్పుడు హీరోలు తమకోసం తాము నటించే వాళ్ళు . కానీ ఇప్పుడు మాత్రం తమ కోసం తాము నటించడమే కాకుండా పక్క హీరోలకి కూడా హెల్ప్ చేస్తున్నారు . గతంలో పక్క హీరోలకి హెల్ప్ చేయాలి అన్న ..పక్క హీరోల సినిమాలకి గెస్ట్ గా రావాలి అన్న.. చాలా చాలా తలనొప్పులు .. చాలా చాలా ఆలోచించే వాళ్ళు . కానీ ఇప్పుడు మాత్రం ఒకే సినిమాలో ఇద్దరు కాదు ముగ్గురు హీరోలు కూడా కలిసి నటిస్తున్నారు. పరిస్థితి అంతలా మారిపోయింది . అఫ్కోర్స్ అదంతా మన మంచికే అంటున్నారు సినీ ప్రేమికులు.  కాగా డైరెక్టర్స్ కూడా అలాగే ఇద్దరి హీరోలను పెట్టి తెరకెక్కించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .


అంతేకాదు ఇద్దరు బడా పాన్ ఇండియా స్టార్స్ కూడా ఒకే సినిమాలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం గమనార్హం. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ అదే విధంగా తారక్ ఎంతో ఇష్టంగా ప్రతిష్టాత్మకంగా నటించిన మూవీ ఎలాంటి "ఆర్ ఆర్ ఆర్" ఎంత సెన్సేషనల్ హిట్ అయ్యిందో కలెక్షన్స్ సాధించిందో అందరికీ తెలిసిందే . సాధారణంగా ఇద్దరు బడా హీరోలతో సినిమా అంటే అది చాలా రిస్కీ ప్రాసెస్. ఒక కథను ఒకరితో తెరకెక్కించడమే పెద్ద గగనమైన విషయం . అయితే ఇద్దరు హీరోలతో బ్యాలెన్స్ చేస్తూ ఇద్దరు స్టార్స్ ఫ్యాన్స్ ని హర్ట్ కాకుండా సినిమాను తెరకెక్కించాలి ..అది నిజంగా టఫెస్ట్ జాబ్ .



కానీ రాజమౌళి ఆ పనిని సునాయాసంగా కంప్లీట్ చేసేసాడు . అయితే ప్రెసెంట్ మహేష్ బాబుతో ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టుని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి . కాగా రాజమౌళి - రామ్ చరణ్ - తారక్ కంటేముందే ఇద్దరు బడా హీరోలతో మల్టీ స్టారర్ మూవీ ని ప్లాన్ చేశారట . వాళ్లు మరెవరో కాదు 'రామ్ చరణ్' అలాగే మెగాస్టార్ 'చిరంజీవి'. మగధీర సినిమాలో రామ్ చరణ్ అదే విధంగా చిరంజీవి ఇద్దరి క్యారెక్టర్ లను హైలైట్ అయ్యే విధంగా అనుకున్నారట .



కానీ చిరంజీవి అప్పటికి సినిమాలపై ఇంట్రెస్ట్ లేకపోవడం ..రాజకీయాల వైపు మళ్లడం తో మగధీరలో ఆయన క్యారెక్టర్ ని ఒప్పుకోనికుండా చేసింది.  అయితే ఆ క్యారెక్టర్ ని లేపేసి కేవలం గెస్ట్ క్యారెక్టర్ మాత్రమే మెగాస్టార్ ని ఉపయోగించుకున్నాడు రాజమౌళి . ఒకవేళ అప్పుడు కాని చిరంజీవి ఒప్పుకొని ఉంటే మాత్రం అది నిజంగా వేరే లెవెల్ అనే అంటున్నారు అభిమానులు . ఆ తర్వాత వీళ్ళ కాంబోలో 'ఆచార్య' సినిమా 'బ్రూస్లీ' వచ్చాయి. కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఫ్యూచర్ లోనైనా మెగా హీరోస్ ఫుల్ సాటిస్ఫై అయ్యే మల్టీస్టారర్ మూవీ వస్తుందేమో ఎదురు చూద్దాం...!???

మరింత సమాచారం తెలుసుకోండి: