మంచు విష్ణు మనోజ్ ల మధ్య ప్రస్తుతం వివాదం ఏ స్థాయికి వెళ్లిపోయిందో చెప్పనక్కర్లేదు.. ఒకరిపై ఒకరు ఎక్స్ వేదికగా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. మొదట విష్ణు తన తండ్రి డైలాగ్ పెట్టి ఇది నాకు ఫేవరెట్ డైలాగ్ అని షేర్ చేశారు.దానికి కౌంటర్గా మంచు మనోజ్ కూడా కన్నప్ప సినిమాలో నటించిన కృష్ణంరాజుకి సంబంధించి పోస్టులు పెట్టి నువ్వు ఎప్పటికీ ఫ్రాడ్ కుక్కవే అన్నట్లు మనోజ్ పోస్ట్ పెట్టారు. అంతేకాదు మోహన్ బాబు కి సంబంధించిన వీడియో క్లిప్ పెట్టి నా భార్య అడ్డు రాకపోతే నీ తల ఎప్పుడో నరికి నీ పెళ్ళాంఒళ్ళో పెట్టేవాడిని అంటూ పరోక్ష ట్వీట్ పెట్టాడు. అంతేకాకుండా ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతూ.. నేను ఆస్తి కోసమే ఇలాంటి పనులు చేస్తున్నానని అంటున్నారు.కానీ నాకు ఆస్తి వద్దు. నేను విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఈ పోరాటం చేస్తున్నాను. 

ఈ పోరాటం ఆగదు.మా నాన్నను ముందు పెట్టి మా అన్న నడిపిస్తున్న నాటకం ఇదంతా.. చాలామంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నా దగ్గర మొరపెట్టుకున్నారు. అందుకే నేను ఈ న్యాయ పోరాటం చేస్తున్నాను. మా అన్నకు 200 కోట్లు పెట్టి కన్నప్ప సినిమా తీయడానికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి. ఈ విషయం నేను అడగాలనుకుంటే నేను ఆస్తి కోసం వచ్చానని చెబుతున్నారు. మా నాన్న జల్ పల్లి లో ఉంటున్న ఆయన నివాసం నుండి నన్ను వెళ్ళిపోమని కోర్టు ద్వారా ఆర్డర్స్ పంపారు అంటూ మంచు మనోజ్ చెప్పుకొచ్చారు.అయితే తాజాగా మనోజ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. అయితే ఆ పోస్టులో నేను ఒంటరిగా వస్తానని నీకు మాట ఇస్తున్నాను. మనిద్దరం కూర్చుని మాట్లాడుకుందాం.. నాన్న,భార్యలు, పనివాళ్ళు అందరినీ పక్కన పెడదాం. మనిద్దరమే మాట్లాడుకుందాం. 

నేను ఒంటరిగా వస్తాను నువ్వు ఎవర్ని తెచ్చుకున్నా పర్వాలేదు.ఇద్దరం డిబేట్ పెట్టుకుందాం.. మీ కరెంట్ తీగ అంటూ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు.అయితే ఈ క్యాప్షన్ కింద పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది మూవీలోని ఒక ఫోటో పెట్టాడు.ఆ ఫోటోలో బ్రహ్మానందం నటి హేమను బుగ్గ గిల్లుతాడు.ఆ పక్కనే ఉన్న ప్రదీప్ ఆశ్చర్యంగా చూస్తాడు. అయితే దానికి సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట షేర్ చేయడంతో పాటు మనోజ్ ఆ పోస్ట్ చేయడంతో చాలామంది నెటిజన్లు మంచు మనోజ్ విష్ణుకు సంబంధించి ఏదైనా సీక్రెట్ వ్యవహారాలను బయట పెట్టాలని చూస్తున్నారా.. పెట్టిన ఫోటో వెనుక ఉన్న అర్థం ఏంటి అంటూ చాలామంది నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికి సోషల్ మీడియాలో మంచు మనోజ్ పెట్టే పోస్టులు మాత్రం చాలా వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: