రవితేజ సినిమాలు సాధారణంగా ఎనర్జీతో నిండి ఉండడమే కాకుండా హాస్యంతో కూడిన యాక్షన్ సీన్స్ మరియు మాస్ డైలాగులతో ఉంటాయి.అలాంటి వాటిల్లో విక్రమార్కుడు మరియు కిక్ వంటి సినిమాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి.ఇదే ఆయన్ను అభిమానులలో ప్రత్యేకమైన స్థానానికి తీసుకువెళ్ళింది.ఆయన ధమాకా మూవీకు ముందు చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాపులుగా నిలబడ్డాయి అయితే 'ధమాకా' మూవీ మళ్ళా ఆయన కేరిర్ ను మలుపు తిప్పి గాడిలో పెట్టింది.
అయితే ధమాకా మూవీ తర్వాత కూడా రవితేజ చేసిన ఏ మూవీ కూడా కలెక్షన్స్ పరంగా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేదు.వరుస ఫెయిల్యూర్ తో అల్లాడుతున్న మాస్ మహారాజ్ ప్రస్తుతం 'మాస్ జాతర' మూవీపైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ మూవీ తరువాత రైటర్ భాను డైరెక్షన్లో ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ 'సూపర్ హీరో' మూవీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే దానికి సంబంధించి ఆఫీసియల్గా మేకర్స్ అనౌన్స్ చేయలేదు.తెలుగు సినిమాల్లో ప్రస్తుతం సూపర్ హీరో కథలకి మంచి మార్కెట్ ఉంది. రవితేజ వంటి స్టార్ హీరో ఇలా పాత్రలు చేస్తే ప్రేక్షకుల ఆదరణ పొందడం ఖాయం.రవితేజ సూపర్ హీరోగా కనిపించాలంటే,ఆయన కథా శైలిలో స్టైలిష్ యాక్షన్ ఎలిమెంట్స్,సరికొత్త విజువల్ ఎఫెక్ట్స్ చేర్చడం అనేది చాలా ముఖ్యమని మేకర్స్ భావిస్తున్నారు.