సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ వార్త అబద్దం అని తెలుసుకోవడం చాలా చాలా కష్టంగా మారిపోతూ పెద్ద హెడేక్ క్రియేట్ చేస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి వార్త నిజం అని చెప్పలేకపోతున్నాం . అదేవిధంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి వార్తని కూడా  ఇది అబద్దమే అంటూ కొట్టి పడేయలేకపోతున్నాం. ఎందుకంటే ఎన్నో ఎన్నో వార్తలు ఎంతో మంది స్టార్ సెలబ్రిటీ లైఫ్ లో జరిగే విషయాలను జనాలకి ముందుగానే అందజేసింది ఈ సోషల్ మీడియా. మరి ముఖ్యంగా సమంత - నాగచైతన్య విడాకుల మేటర్ అందుకు ప్రత్యేక నిదర్శనం . వాళ్ళు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ 6 నెలల ముందు నుంచే సోషల్ మీడియాలో ఓ వార్త బాగా ట్రెండ్ అయింది .


కానీ చాలామంది అది ఫేక్ అంటూ సమంత - నాగచైతన్య అన్యోన్యంగా ఉన్నారు అని.. ఇదంతా ఎవరో కావాలని క్రియేట్ చేసింది అంటూ తప్పుబట్టారు . సీన్ కట్ చేస్తే ఆరు నెలలకి వాళ్లే స్వయంగా మేము విడాకులు తీసుకోబోతున్నాం అంటూ అఫీషియల్ గా ప్రకటించారు . దీంతో సినిమా ఇండస్ట్రీ షేక్ అయిపోయింది.  కేవలం సమంత నాగచైతన్య కాదు చాలామంది స్టార్ కపుల్స్ స్టార్ సెలబ్రిటీస్ లైఫ్ లో జరగబోయే విషయాలను సోషల్ మీడియా ముందే చెప్పేసింది . అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త మాత్రం తెగ హల్చల్ చేస్తుంది . అది కూడా అల్లు అర్జున్ - మెగాస్టార్ చిరంజీవిలకు సంబంధించినది కావడంతో జనాలు తెలుసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .



మెగా ఫ్యామిలీ - అల్లు ఫ్యామిలీ మధ్య సరిగ్గా రిలేషన్షిప్ లేదు అని వాళ్ళ మధ్య కొన్ని ఫ్యామిలీ వార్ లు జరుగుతున్నాయి అంటూ గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే వస్తున్నాయి . దానికి తగ్గట్టే మెగా హీరోలు పుష్ప2 సినిమాని ఎవరు సపోర్ట్ చేయకపోవడం పెద్ద సంచలనంగా మారింది . అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం ఆ తర్వాత చిరంజీవి దగ్గరుండి బెయిల్ ఇప్పించడంతో ఈ వార్ కొంచెం తగ్గిందనే అంటున్నారు జనాలు. మరి ముఖ్యంగా అల్లు అర్జున్ స్పయాన నాగబాబు అదే విధంగా చిరంజీవి ఇంటికి వెళ్లి మరి థాంక్స్ చెప్పాడు . దానికి సంబంధించిన పిక్చర్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి. అయితే అల్లు అర్జున్ అరెస్టు అవ్వకముందు సినిమా రిలీజ్ అయ్యే ముందు సినిమాలోని పాటలను  పిల్లలు ఇంట్లో ప్లే చేస్తుంటే మెగా హీరోలు ఒప్పుకునే వారే కాదట .



పుష్ప 2 సినిమాకి సంబంధించిన ఏ పాట టీవీలో ప్లే అవుతున్న సరే వెంటనే ఛానల్ మార్చేసేవారట . పిల్లలు అలా పాటలను చూస్తున్న సరే అసలు మెగా ఫ్యామిలీ పుష్ప2 అన్న పేరే ఇంట్లో రానికుండా చేసిందట . ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.  అయితే ఇదంతా ఫేక్ అంటూ కొట్టి పడేస్తున్నారు మెగా ఫాన్స్ . చిరంజీవిది అలాంటి మనస్తత్వం కాదు అని ..అలా అయితే ఎందుకు బెయిల్ ఇప్పిస్తాడు అంటున్నారు . కొంతమంది కావాలని మెగాస్టార్ చిరంజీవిని బ్యాడ్ చేసేందుకు ట్రై చేస్తున్నారు అని.. గేమ్ చేంజర్ సినిమాను అలాగే ఫ్లాప్ చేశారు అని మండిపడుతున్నారు. కొందరైతే ఇలా కూడా పగ తీర్చుకుంటారా ..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: