బాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ అయినప్పటికీ సౌత్ లోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్న నటి ఎవరైనా ఉన్నారా అంటే ఇప్పుడు అందరికీ గుర్తుకు వచ్చేది ఊర్వశి రౌటేలా మాత్రమే.ఎందుకంటే ఈమె గతంలో వాల్తేరు వీరయ్య లోని బాసు వేరే ఈజ్ ద పార్టీ ద్వారా సౌత్ లో పాపులర్ అయింది. అలాగే తాజాగా వచ్చిన డాకు మహారాజ్ లో దబిడి దిబిడి సాంగ్ తో మరోసారి ఫేమస్ అయిపోయింది.అలా ఈ రెండు సినిమాల ద్వారానే ఊర్వశి కి ఎక్కడలేని గుర్తింపు వచ్చింది. దాంతో పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మాట్లాడుతుంది. ఇక రీసెంట్గా సైఫ్ పై జరిగిన కత్తి దాడి గురించి ఆమె అవహేళనగా మాట్లాడుతూ.. డాకు మహారాజ్ హిట్ అయ్యాక నాకు మా అమ్మ నాన్నలు ఖరీదైన గిఫ్ట్ లు ఇచ్చారు. కానీ వాటిని పెట్టుకొని బయటికి వెళ్లాలంటే ఎక్కడ దాడి చేస్తారో అని భయమేస్తుంది అంటూ సైఫ్ ని అవమానిస్తూ మాట్లాడింది. 

అయితే ఈమె మాటలపై మళ్లీ క్లారిటీ ఇస్తూ..సైఫ్ ని క్షమించమని కోరింది. అంతేకాదు ఆయనకి జరిగిన దాడి తీవ్రత తనకి తెలియదని క్షమాపణలు కోరింది.ఈ విషయం పక్కన పెడితే తాజాగా మరోసారి ఊర్వశి రౌటేలా తన నోటి దూలతో వివాదంలో ఇరుక్కుంది. తాజాగా ఆమెకి ఓ మీడియా ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురయింది. మీతో పాటు బాలీవుడ్ నటి కియారా అద్వానీ సినిమా కూడా విదలైంది.దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని అడగగా.. కలెక్షన్స్ ఎక్కువ ఇచ్చే ట్యాగ్స్ ఉండాలి.అప్పుడే మంచి గుర్తింపు వస్తుంది.ప్రపంచవ్యాప్తంగా నా యాక్టింగ్ కి మంచి గుర్తింపు లభించింది. అంతేకాదు తక్కువ సమయంలోనే 100 కోట్లు రాబట్టిన ఫస్ట్ అవుట్ సైడ్ నటిగా నాకు రికార్డు కూడా వచ్చింది.

 చాలామంది నన్ను అభినందిస్తున్నారు.సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతున్నారు.వాళ్ళ ట్విట్లు అన్ని చదివాను.ఊర్వశి సినిమా బ్లాక్ బస్టర్ అంటున్నారు.అందులో నా తప్పేమీ లేదు అంటూ నటన గురించి మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్ సినిమాని ఉద్దేశించి పరోక్ష కామెంట్లు చేసింది ఊర్వశి రౌటేలా.అయితే ఈమె మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది మెగా ఫ్యాన్స్ ఊర్వశి పై ఫైర్ అవుతున్నారు. గేమ్ చేంజర్ కథపరంగా మాత్రమే డిజాస్టర్.కానీ యాక్టింగ్ పరంగా కాదు. గేమ్ ఛేంజర్ మూవీలో అంజలి, కియారా అద్వానీ,సూర్య, రాంచరణ్ ల యాక్టింగ్ చాలా బాగుంది. కానీ మీరు యాక్టింగ్ విషయంలో నోరు జారీ తప్పు చేశారు అంటూ మెగా ఫ్యాన్స్ ఊర్వశి పై ఫైర్ అవుతున్నారు. ఇక ఊర్వశి మాటలపై మెగా హీరో కూడా వార్నింగ్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: