యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అక్కినేని నాగార్జున వారసుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన నాగచైతన్య తనదైన శైలిలో ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నాడు.. నాగ చైతన్య తన కెరీర్ లో ఇప్పటికే 23 సినిమాలు చేసాడు.. చైతూ చేసినా ప్రతీ సినిమా దేనికదే ప్రత్యేకం.. చైతూ కెరీర్ లో హిట్స్ తో పాటు పరాజయాలు కూడా వున్నాయి.. తన కెరీర్ ప్రారంభం నుంచి కెరీర్ ని మలుపు తిప్పే సినిమా కోసం చైతూ ఎదురుచూస్తున్నాడు.. 2023 లో వచ్చిన “కస్టడీ” సినిమాతో చివరిగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన చైతూ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఈ సారి భారీ బ్లాక్ బస్టర్ అందుకోవాలనే ఉద్దేశంతో పాన్ ఇండియా సక్సెస్ఫుల్ డైరెక్టర్ చందూ మొండేటి డైరెక్షన్ లో ఓ సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు.. ఆ సినిమానే “తండేల్”.. ఈ సినిమాలో నాగచైతన్య సరసన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.. 

గతంలో వీరిద్దరూ కలిసి చేసిన “ లవ్ స్టోరీ” మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.. “తండేల్ “ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పకుడిగా బన్నీ వాసు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు..ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన “ బుజ్జి తల్లి “, “నమోః శివాయ “ సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి..పాకిస్థాన్ జైలులో కొన్ని నెలల పాటు బందీలుగా చిత్రహింసలు అనుభవించి భారత్‍కు తిరిగి వచ్చిన శ్రీకాకుళం మత్స్యకారుల కథ ఆధారంగా తండేల్ మూవీ రూపొందుతోంది.. ఈ చిత్రాన్ని మేకర్స్ ఫిబ్రవరి 7 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.యదార్ధ ఘటనలతో కూడిన అద్భుతమైన ప్రేమకథ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. ఈ సినిమాతో చైతూ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అందుకుంటాడని ఫ్యాన్స్ నమ్మకంగా వున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: