కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన సినిమానే ఈ "గేమ్ ఛేంజర్ '. ఈ సినిమా జనవరి 10వ తేదీ రిలీజ్ అయ్యి నెగిటివ్ టాక్ సంపాదించుకుంది. కలెక్షన్స్ పరంగా కోట్లు కుమ్మేస్తున్న కూడా టాక్ ప్రకారం మాత్రం ఎక్కడా పాజిటివ్ రివ్యూలు అందుకోలేక పోతుంది, మరీ ముఖ్యంగా గ్లోబల్ స్థాయి హీరోకి ఇలాంటి కథనా..? అంటూ చాలామంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు . అయితే ఈ సినిమా దిల్ రాజుకి తీరని నష్టాన్ని మిగిల్చింది అంటూ చాలామంది కామెంట్స్ చేశారు . సినీ ప్రముఖులు .. సినీ విశ్లేషకులు సైతం గేమ్ ఛేంజర్ పై నెగిటివ్ గా మాట్లాడారు . ఇప్పుడు ఆ లెక్కలను పూడ్ఛేందుకు రామ్ చరణ్ మళ్ళీ దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమాకి కమిట్ అయ్యారట .
ప్రజెంట్ రాంచరణ్ - బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమా షూట్లో బిజీగా ఉన్నారు . ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . ఈ రెండు సినిమాలు కంప్లీట్ అవ్వగానే మరో కోలీవుడ్ డైరెక్టర్ తో క్రేజీ మూవీ ని ఫిక్స్ చేసుకున్నారట . హైలెట్ ఏంటంటే ఈ ప్రాజెక్టు నిర్మించబోయేది డైరెక్టర్ దిల్ రాజు అంటూ ఓ టాక్ వినిపిస్తుంది. ఆల్రెడీ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ నటించిన సినిమాను ప్రొడ్యూస్ చేసి దిల్ రాజు బాగా నష్టాలు కొన్ని తెచ్చుకున్నాడు.. మరి అలాంటప్పుడు ఇంకొకసారి ఈ రిస్క్ చేయడం దేనికి అంటున్నారు అభిమానులు. అయితే రామ్ చరణ్ ఈసారి మాత్రం గట్టిగానే ప్లాన్ చేశాడు అని ..రామ్ చరణ్ ఈసారి దిల్ రాజుకి భారీ లాభాలు తెచ్చి పెడతారు అంటూ మెగా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..?