నాలుగు రోజులలోనే 15 కోట్ల షేర్ కరెక్షన్స్ రాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను అందించిందట. సాధారణంగా సంక్రాంతి బరిలో సినిమాలు ఎంటర్టైన్మెంట్ కి ప్రాధాన్యత ఇస్తే ఎలాంటి కలెక్షన్స్ రాబడతాయో చూపించారు. ఇదే సినిమా జోరు కొనసాగితే నాలుగు రోజులలోనే 2.9 కోట్ల చేరని నైజాంలో సాధించడం తో ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా తనదైన ముద్ర వేసుకుంటుందంటూ ప్రేక్షకులు వెల్లడిస్తున్నారు. ప్రతి సెంటర్లో కూడా కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాని ఎక్కువగా ఆదరిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే 130 కోట్లకు పైగా కలెక్షన్స్ దాటినట్లు తెలుస్తోంది. ఇలాగే కంటిన్యూ అయితే 200 కోట్ల మార్కును సైతం చేరడం పక్క అని పలువురు అభిమానులు కూడా భావిస్తున్నారు. డైరెక్టర్ అనిల్ రావు పూడి దర్శకత్వం వెంకటేష్ నటన కామెడీ టైమింగ్ తో ఈ సినిమాలోని సంగీతం కూడా ప్రేక్షకుల ను బాగా ఆకట్టుకుంది ఈ సినిమా విజయానికి కూడా ప్రధాన కారణాలుగా నిలిచాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు . మొత్తానికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో నైజాంలో ఒక ప్రత్యేకమైన విజయంగా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం సినిమా. మరి వీకెండ్ ముగిసే సమయానికి ఎంత మేరకు కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.ఇప్పటివరకు వెంకటేష్ 100 కోట్ల మార్కొని అందుకోలేకపోయారు సంక్రాంతికి వస్తున్నాను సినిమాతో అందుకోవడం జరిగిందని అభిమానులు ఖుషి అవుతున్నారు.