గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజు ఏకంగా రూ. 156 కోట్ల ఓపెనింగ్స్ కలెక్షన్లను రాబట్టిన గేమ్ చేంజర్ తర్వాత మాత్రం యావరేజ్ గా నడుస్తూ ముందుకు వెళుతుంది. గేమ్ చేంజర్ సినిమాలో రాంచరణ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించారు.


ఎస్జే సూర్య విలన్ పాత్రను పోషించారు. శ్రీకాంత్, సునీల్, సముద్రఖని వంటి ప్రముఖులు కీలక పాత్రలను పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు దాదాపు రూ. 450 కోట్ల భారీ బడ్జెట్ తో గేమ్ చేంజర్ సినిమాను నిర్మించారు. దిల్ రాజు తన కెరీర్ లో ఇదే హైయెస్ట్ బడ్జెట్ తో గేమ్ చేంజర్ సినిమాను తెరకెక్కించారు. అయితే గేమ్ చేంజర్ సినిమాను రామ్ చరణ్ అభిమానులు ఆశించినంతగా అలరించలేకపోయింది.


దీంతో దిల్ రాజు కాస్త నష్టాలు ఎదుర్కోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కచ్చితంగా గేమ్ చేంజర్ సినిమా నష్టాలు ఇస్తుందని అంటున్నారు. దీన్ని రికవరీ చేయాలనే ఉద్దేశంతో రామ్ చరణ్ తన మూడో సినిమాని రాజు గారి బ్యానర్ లోనే చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇంకా ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు.


కానీ ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం మరో సినిమా రావడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో ఉన్న ఆర్సీ16 పూర్తయిన తర్వాత సుకుమార్ తో ఆర్సి 17 మొదలవుతుంది. ఇవి రెండు అయ్యేలోపు ఏదైనా మంచి కథతో దర్శకుడు వస్తే రామ్ చరణ్ రాజుతో నిర్మాణంలో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: