చాలా రోజుల నుండి విజయ్ త్రిషల మధ్య ఎఫైర్ ఉందని, అందుకే తన భార్యకు విజయ్ దూరంగా ఉంటున్నారని, త్వరలోనే వీరి విడాకులు కూడా జరగబోతున్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్త నిజమే అన్నట్లుగా విజయ్ త్రిష కలిసి కీర్తి సురేష్ పెళ్లికి ఒకే ఫ్లైట్లో వెళ్లారు. అలాగే వీరిద్దరూ కలిసి వెకేషన్ కి వెళ్ళిన ఫొటోస్ కూడా నెట్టింట చక్కర్లు కొట్టాయి.. అలా వీరి మధ్య ఉన్నది నిజమైన రిలేషనే అని చెప్పడానికి ఇవన్నీ ఆధారాలుగా చూపించారు. చాలామంది.అయితే తాజాగా తన లైఫ్ లో మోస్ట్ స్పెషల్ పర్సన్ అంటూ విజయ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది త్రిష. మరి ఇంతకీ త్రిష ఏం మాట్లాడిందో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం త్రిష అజిత్ కలిసి నటించిన విడాముయర్చి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది..

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న త్రిష సంచలన వ్యాఖ్యలు చేసింది త్రిష. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా జీవితంలో ఎప్పటికీ స్పెషల్ పర్సన్ విజయ్... నేను ఇప్పటి వరకు నటించిన హీరోలలో విజయ్ ఎప్పటికి నాకు ప్రత్యేకమే.. విజయ్ చాలా లవబుల్ పర్సన్.. విజయ్ తో చేసిన వర్క్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. ఎప్పటికీ విజయ్ ని నేను అభిమానిస్తాను అంటూ త్రిష చెప్పుకొచ్చింది.అయితే అందరి హీరోల కంటే విజయ్ తనకి చాలా స్పెషల్ అని త్రిష మరోసారి చెప్పి ఆయనతో ఉన్న రిలేషన్ ని బయట పెట్టిందని చాలా మంది నెటిజన్ లు భావిస్తున్నారు.

అంతేకాదు చాలా రోజుల నుండి వీరి మధ్య ఎఫైర్ వార్తలు వినిపిస్తున్నాయి కాబట్టి త్రిష మెల్లిమెల్లిగా ఈ విషయాన్ని అఫీషియల్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఇలా విజయ్ గురించి మాట్లాడింది అని..త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోవడం ఖాయం అంటూ త్రిష మాట్లాడిన మాటలని బట్టి నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇక త్రిష చేతిలో ప్రస్తుతం నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఇక ఈ ఏడాది చిరంజీవితో విశ్వంభర మూవీ తో పాటు మరో రెండు సినిమాలతో కూడా త్రిష ఆడియన్స్ ముందుకు రాబోతోంది

మరింత సమాచారం తెలుసుకోండి: