ఆ తర్వాత చాలా కాలం పాటు సైలెంట్ గా ఉన్న అక్కినేని అఖిల్ రీసెంట్ గానే జైనబ్ రవ్జీ ని నిశ్చితార్ధం చేసుకున్నారు. ఇది కూడా ప్రేమ వివాహమే . అయితే అక్కినేని నాగచైతన్య - శోభిత దూళిపాళ్ల పెళ్లిలో హైలెట్గా నిలిచిన ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది . మార్చి 24వ తేదీ వీల్ల పెళ్లి ఘనంగా జరగబోతున్నట్లు తెలుస్తుంది. జైనబ్ రవ్జీ కుటుంబ సభ్యుల ఈ పెళ్లికి సంబంధించిన పూర్తి పనులను చూసుకుంటున్నారట . ఈ పెళ్లికి స్టార్ బిజినెస్ పర్సన్స్ తో పాటు స్టార్ సెలబ్రిటీస్ ..క్రికెటర్స్ ని కూడా ఆహ్వానించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ వార్త హీట్ పెంచేస్తుంది.
అయితే అక్కినేని అఖిల్ కు జైనబ్ రవ్జీ కి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడడానికి కారణం రానా దగ్గుబాటి భార్య మిహిక బజాజ్ అంటూ కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి . మిహికా బజాజ్ కి చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్ అఖిల్ కి కాబోయే భార్య అంటూ కూడా ఇన్ సైడ్ నుండి సమాచారం అందుతుంది. దీంతో వీళ్ళ ప్రేమాయణానికి బీజం వేసింది కూడా ఆమెనే అంటూ అప్పట్లో జనాలు మాట్లాడుకున్నారు . సోషల్ మీడియాలో ఈ వార్త ఇప్పుడు బాగా వైరల్ గా మారింది. మొత్తానికి అఖిల్ కూడా ఓ ఇంటి వాడు అయిపోతున్నాడు అని అక్కినేని ఫ్యన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.