అనిల్ రావిపూడి సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ పాన్ ఇండియా డైరెక్టర్లు ఉన్నా సరే తనదైన స్టైల్ లో సినిమాలను తెరకెక్కిస్తూ కామెడీనే ప్రధాన అస్త్రంగా మార్చుకొని మరి ఇండస్ట్రీని ఓ రేంజ్ లో ఏలేస్తున్నాడు . కాగా రీసెంట్గా అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం.  ఈ సంక్రాంతి రేసులో బడా బడా సినిమాలు వచ్చినప్పటికీ సంక్రాంతి విన్నర్ గా వెంకి స్టార్ హిట్ అందుకున్నాడు., అంటే దానికి ఏకైక కారణం "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా డైరెక్టర్ అనే సినిమానే చెప్పాలి .


అనిల్ రావిపూడి సినిమాను ఆ విధంగా కామెడీతో తెరకెక్కించారు.  నిజానికి సినిమాలో పెద్దగా కాన్సెప్ట్ ఏమీ లేదు ..కధ  అయితే అస్సలు లేదు . రెగ్యులర్ స్టోరీ నే కానీ ..కామెడీ టైమింగ్ మాత్రం పిక్స్ కి తీసుకెళ్లి మరి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు అనిల్ రావిపూడి.  అయితే కొంతమంది మాత్రం దీన్ని క్రీంజ్ కామెడీ అంటూ కామెంట్స్ చేశారు. ఇవి కాస్త అనిల్ రావిపూడి చెవిన పడినట్టు ఉన్నాయి . ఈ క్రమంలోనే  'సంక్రాంతికి వస్తున్నాం' ఈవెంట్లో పరోక్షంగా ఈ క్రీంక్ కామెడీ కామెంట్స్ పై అనిల్ రావిపూడి కూసింత ఎమోషనల్ గా మాట్లాడారు .



"నేను స్క్రీన్ ప్లే  రాయడం నేర్చుకోలేదు.. ఫిలిం మేకింగ్ కూడా చదవలేదు.. కొందరు రివ్యూ రైటర్స్ రాసే పదాలు కూడా నాకు అసలు తెలియవండి. నాకు తెలిసినది అంతా ప్రేక్షకుడిగా విజువల్ కొట్టే సినిమా జనాలకు అందించాలి. ప్రేక్షకులు ఏ సినిమాను చూసి నవ్వుకుంటారు.. ఎలా తెరకెక్కిస్తే నవ్వుకుంటారు .. అది ఒక్కటే తెలుసు . నేను అలాంటి సినిమాలు చూస్తూనే పెరిగాను . ఇకపై కూడా అలాంటి సినిమాలే చేస్తాను. ఎవరు ఏమనుకున్నా సరే అంటూ కూసింత ఘాటుగానే చెప్పారు". దీంతో అనిల్ రావిపూడి మనసును ఆ క్రీంజ్ కామెంట్స్ హర్ట్ చేశాయి అంటూ క్లియర్ గా తెలిసిపోయింది అంటున్నారు అభిమానులు . అంతేకాదు పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాలకన్నా నీ సినిమా చాలా చాలా బెటర్ ఇంకా మంచి మంచి సినిమాలు తీసి జనాలను నవ్వించు అంటూ అనిల్ రావిపూడికి సపోర్ట్ చేస్తున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: