సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు ఎంత సెల్ఫిష్ గా ఉంటారు .. ఎంత కఠినంగా ఉంటారు అన్న విషయాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు.  ఎందుకంటే అది వాళ్ళకి మొదటి నుంచి బాగా అలవాటు . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే బడా బడా స్టార్స్ మాత్రం తమ సినిమాల విషయంలో చాలా కఠినంగా పక్క ప్లాన్ తో ముందుకు వెళ్తూ ఉంటారు. తమ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయాలి.. ఏ టైం లో రిలీజ్ చేయాలి.. ఆ సినిమాకి రెండు నెలల ముందు రెండు నెలల తర్వాత ఎలాంటి సినిమా రిలీజ్ అవుతున్నాయి అంటూ ముందుగానే పక్క ప్రణాళికను రూపొందించుకుంటారు .


అంతేకాదు ఆ సమయంలో వాళ్ళకి ఏదైనా సినిమా అడ్డొస్తుంది అని తెలిసిన సరే .. బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న ఫాలోయింగ్ తో ఆ సినిమా విడుదలను అడ్డుకుంటూ ఉంటారు . కాగా రీసెంట్గా ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. మాస్ మహారాజా రవితేజ గురించి అందరికీ తెలిసిందే.  సినిమా ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి పైకి ఎదిగిన హీరో . కాగా రవితేజ పక్క హీరోలకి కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు . ఎంతలా అంటే తన సినిమా రిలీజ్ అవుతుంది అని తెలిసినా కూడా తన సినిమా ప్రమోషన్స్ కన్నా కూడా పక్క హీరోల సినిమాలకు సపోర్ట్ చేస్తూ ఉంటారు .



అంత మంచి మనిషి . కాగా వేరే హీరోల సినిమాలలో గెస్ట్ రోల్ లో కనిపించారు .. మల్టీస్టారర్ మూవీలు కూడా ఓకే చేశారు . కాగా  చిరంజీవితో "వాల్తేరు వీరయ్య" సినిమాలో కూడా రవితేజ స్క్రీన్ షేర్ చేసుకున్నారు . అంతకు ముందు "అన్నయ్య" అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కాగా వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి పక్కన రవితేజ కాకుండా ఎంతో మంది స్టార్స్ ని అనుకున్నారు  డైరెక్టర్ బాబీ. కానీ రవితేజ నే ఆ పాత్రకి సూట్ అవుతాడు అంటూ చిరంజీవినే స్వయాన సజెస్ట్ చేశారు .



అయితే ఇప్పుడు మరొకసారి మెగా హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు రవితేజ . అది కూడా రామ్ చరణ్ తో . రామ్ చరణ్ - బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమాలో రవితేజ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారట . హైలెట్ ఏంటంటే ఈ పాత్రను కూడా చిరంజీవినే సజెస్ట్ చేశారట . దీంతో సినిమా ఇండస్ట్రీలో ఈ వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది.  అప్పుడు తండ్రి కోసం ఇప్పుడు కొడుకు కోసం క్రేజీ కాంబో వేరే లెవెల్ . రామ్ చరణ్ - రవితేజ కాంబో సినిమా పీక్స్ కి వెళ్లడం ఖాయం అంటున్నారు అభిమానులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: