టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ బ్యూటీ తనదైన నటన, అందంతో తెలుగు ప్రజలను ఆకట్టుకుంది. 18 ఏళ్ల వయసులో కాలేజీ చదువుతున్న సమయంలోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టి 2009లో కన్నడ చిత్రం ఢిల్లీ "గిల్లి"తో హీరోయిన్ గా తన కెరీర్ ప్రారంభించింది. 

అనంతరం 2011 కెరటంలో సిద్ధార్త్ రాజ్ కుమార్ సరసన హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా తెలుగు మరియు తమిళ భాషలలో థియేటర్లలో రిలీజ్ అయింది. అనంతరం తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు అందుకున్న ఈ చిన్నది ఆ సినిమా అనంతరం వరుస పెట్టి సినిమాలలో నటించి అభిమానులను ఆకట్టుకుంది. యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా చేసే అవకాశాన్ని అందుకుంది. 

ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటుంది. కాగా కొద్దిరోజుల క్రితమే రకుల్ ప్రీత్ సింగ్ తాను ప్రేమించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు నిర్మాత జాకి బగ్నానిని ప్రేమించి వివాహం చేసుకుంది. వివాహమైనప్పటికీ తన అందాల ఆరబోతలో ఏమాత్రం రాజీ పడకుండా గ్లామర్ వలకబోస్తూ హాట్ హాట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ ఓ సరస్సులో దూకి రచ్చ చేసింది. 

బికినీ వేసుకొని నీటిలో స్విమ్మింగ్ చేస్తూ తన అందాలను చూపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. వివాహమైనప్పటికీ చాలా హాట్ గా అందాలని చూపిస్తున్నావు అంటూ కొంతమంది నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. ఈ వార్తలపై రకుల్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఈ చిన్నది చేతినిండా వరుస సినిమాలతో బిజీగా ఉంది.





మరింత సమాచారం తెలుసుకోండి: