తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. మెగాస్టార్ చిరంజీవి మొదలు  పంజా వైష్ణవి తేజ్ వరకు దాదాపు పది మంది హీరోలు టాలీవుడ్ లో ఉన్నారు .. వారిలో ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు .. అలాగే పుష్ప2 సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ కూడా ఊహించని రేంజ్‌కు వెళ్ళింది .. సాయిధరమ్ తేజ్ , వరుణ్ తేజ్ , వైష్ణవ తేజ్ , అల్లు సురేష్ కూడా సినిమాలు చేస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ..
 

అయితే ఇప్పుడు మెగా కుటుంబానికి సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది .. మెగాస్టార్ చిరంజీవి , నాగబాబు , పవన్ కళ్యాణ్ మధ్యలో సరదాగా కూర్చున్న పిల్లాడిని గమనించారా ? ఈ బుడ్డోడు ఇప్పుడు తెలుగులో హీరో .. అలాగే ఆరు అడుగుల కట్ అవుట్ తో ఉన్న హీరోకు అమ్మాయిల్లో భారీ ఫాలోయింగ్ కూడా ఉంది .. తెలుగులో ఉన్న మిగిలిన హీరోలకు భిన్నంగా వైవిధ్యమైన కథలతో సినిమాలు చేయటం ఈ హీరో ప్రత్యేకత .. హిట్ ప్లాప్‌ల‌తో సంబంధం లేకుండా  సినిమాలు చేస్తున్న   హీరో ఎవరు అంటే .. ఈ హీరో మరి ఎవరో కాదు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ .. జనవరి 19 అన‌గా ఈ రోజు ఈ మెగా హీరో పుట్టినరోజు దీంతో వరుణ్ తేజ్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

అయితే ఈ రీసెంట్ టైమ్స్ లో వరుణ్ తేజ్ నటించిన సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిపోతున్నాయి .. గని , ఆపరేషన్ వాలెంటైన్ , గాండీవధారి అర్జున వంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర గోర‌ పరాజయాలు అందుకున్నాయి .. అలాగే ఇటీవల భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మట్కా కూడా బాగా నిరాశపరిచింది .. అయితే ఈ సినిమాల్లో వరుణ్ తేజ్ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి .. దీంతో రాబోయే రోజుల్లో ఆయన మంచి కథలతో ముందుకు రావాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు .. అయితే వరుణ్ తేజ్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ  దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది .. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన కూడా బయటకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: