ఈ హాట్ బ్యూటీ భారీ హిట్ కోసం చాలా రోజులు గా ఎదురు చూస్తుంది .. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు వరుస సినిమాలతో దూసుకుపోతుంది . ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో మాత్రం అనుకున్నంత స్థాయి లో విజయం అందుకోలేకపోయింది .. బ్యాక్ టు బ్యాక్ యంగ్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకున్నప్పటికీ అనుకున్నంత స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. అక్కినేని హీరోలు నాగచైతన్య , అఖిలతో సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మకు అక్కినేని బ్రదర్స్ భారీ షాక్ ఇచ్చారు .
ఇక దాంతో ఈ ముద్దుగుమ్మ గ్లామర్ గేట్లు ఎత్తేసింది .. మిస్టర్ మజ్ను సినిమా తర్వాత రామ్ పోతినేని , పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయం అందుకుంది .. ఈ సినిమాలో తన నటనతో పాటు అందంతోను ప్రేక్షకులను మెప్పించింది . ఇక ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు , ప్రభాస్ తో రాజా సాబ్ సినిమాలు చేస్తుంది .. ఈ రెండు సినిమాల షూటింగ్స్ తో తెగ బిజీగా ఉందట ఈ ముద్దుగుమ్మ కాగా ఈ రెండు సినిమాల బిజీ కారణంగా ఈమె చాలా మంది బడా హీరోల సినిమాలను మిస్ చేసుకుందని తెలుస్తుంది .