మెగా హీరో రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించాడు. ఇందులో రామ్ చరణ్ డ్యూయల్ పాత్రలో ప్రేక్షకులను అలరించారు. తండ్రి కొడుకుల పాత్రలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేశాడు. ఇందులో రామ్ చరణ్ సరసన హీరోయిన్లుగా కియరా అద్వానీ, అంజలి నటించారు. ఎస్జె సూర్య విలన్ పాత్రలో అద్భుతంగా నటించారు. సముద్రఖని, శ్రీకాంత్, జయరాం, సునీల్ వంటి తదితరులు ప్రముఖ పాత్రలలో నటించారు. అయితే శంకర్ తెలుగులో మొదటిసారిగా నేరుగా డైరెక్ట్ చేసిన సినిమా గేమ్ చేంజర్. 

కాగా ఈ సినిమాలో శంకర్ దర్శకత్వం అస్సలు బాగోలేదని కొంతమంది రామ్ చరణ్ అభిమానులు ఆగ్రహించారు. ఈ సినిమా డిజాస్టర్ అయిందని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్ల వద్ద యావరేజ్ గా అభిమానులు ఈ సినిమాను చూడడానికి పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు. కాగా, దర్శకుడు శంకర్ తదుపరి చేయబోయే సినిమా ఏంటి అనే చర్చలు తెరపైకి వస్తున్నాయి.


తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఇండియన్-3 సినిమాపై తన పూర్తి దృష్టిని పెడుతున్నట్లుగా చెప్పారు. గేమ్ చేంజర్ సినిమా పూర్తి కావడంతో ఇండియన్-3 సినిమాను చేస్తున్నానని చెప్పారు. ఈ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలను మాత్రమే చిత్రీకరించాల్సి ఉందని చెప్పారు. ఈ సినిమా పూర్తి కావడానికి కేవలం 6 నెలల సమయం మాత్రమే పడుతుంది అని అన్నారు. అన్ని పనులను త్వరగా పూర్తిచేసుకుని త్వరలోనే సినిమాను అభిమానుల ముందుకు తీసుకువస్తామని శంకర్ వెల్లడించారు.

అదే విధంగా తన దర్శకత్వంలో వేల్పారి అనే చారిత్రక కథ సినిమాను తెరకెక్కించనున్నట్లుగా చెప్పారు. మదురై ఎంపిఎస్ వెంకటేశన్ రాసి రచించిన నవల ఆధారంగా సినిమా కథను సిద్ధం చేసినట్లుగా వెల్లడించారు. దీనిని మూడు భాగాలుగా రూపొందించినట్లుగా చెప్పారు. ఈ సినిమా అయినా శంకర్ కు మంచి హిట్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: