మంచు మనోజ్ హీరోగా వచ్చిన శ్రీ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయమైంది .. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా మెప్పించలేదు .. దీంతో తమన్నాకు సరైన గుర్తింపు దక్కలేదు .. అయితే అంతకుముందు హిందీలో చాంద్ షా రోషన్ చెహ్రా అనే సినిమాలో నటించింది .. అలాగే కోలీవుడ్లో కేడీ, వియబారి సినిమాల్లో నటించగా.. ఈ సినిమాలు కూడా ఈమెకు నిరాశనే మిగిల్చాయి .. అయినా కూడా ఈ బ్యూటీ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది .. ఇలా చివరకు దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీడేస్ సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది .. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో వరుస ఆఫర్లు అందుకుంటూ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది.
ఇలా టాలీవుడ్ లో రామ్ చరణ్ , ప్రభాస్ , ఎన్టీఆర్ , అల్లు అర్జున్ , చిరంజీవి , నాగచైతన్య వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది .. హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అర్లించిన తమన్నా తన క్రేజ్ తో తెలుగు చిత్ర పరిశ్రమను ఊపేసింది .. ఇప్పటికీ కూడా పాన్ ఇండియా లెవెల్లో ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు అందుకుంటుంది .. అదే విధంగా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లోను తన సత్తా చాటుతుంది .. అయితే పలు నివేదికల ప్రకారం తమన్న ఆస్తులు దాదాపు 150 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తుంది .. అలాగే బాలీవుడ్ హీరో విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో పడిన విషయం తెలిసిందే త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని కూడా తెలిసిందే.