మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర దర్శ‌కులలో సుకుమార్ కూడా ఒకరు .. ప్రజెంట్ ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా మంచి విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నాయి .. ఇక ఇప్పటికే ఆయన పుష్ప2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో బంపర్ హిట్ అందుకున్నారు .. ఇలాంటి క్రమంలోనే ఆయన తదుపరి సినిమా కోసం భారీ కస్తరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది .. అయినా ఇప్పటికే రామ్ చరణ్ తో తన తర్వాత సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు .. కాబట్టి ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కథ చర్చలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తున్నాయి .. అయితే ఈ సినిమాని కూడా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారట ..


 ఇక ఇదిలా ఉంటే ‘పుష్ప 2’సూపర్ సక్సెస్ అయిన తర్వాత సుకుమార్ రెమ్యూనరేషన్ భారీగా పెంచినట్టు తెలుస్తుంది .. ఇప్పటివరకు 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్న ఆయన ఇప్పుడు 150 కోట్ల వరకు పారితోషకం అందుకోబోతున్నట్లు సమాచారం .. రాజమౌళి తర్వాత తనకంటూ ప్రత్యేక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న సుకుమార్ ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళుతున్నట్టుగా తెలుస్తుంది .. ఏదేమైనా కూడా ఆయన కంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవటంలో ఆయన సక్సెస్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఆయనకు రెమ్యూనరేషన్ భారీగా ఇవ్వడానికి నిర్మాతలు సైతం ముందుకు వస్తున్నారు ..


అలాగే మైత్రి మూవీ బ్యానర్‌లో ఆయన ఇప్పటివరకు చాలా సినిమాలు చేసుకుంటూ వచ్చారు .. కాబట్టి ఇప్పుడు మరోసారి అదే బ్యానర్ లో సినిమా చేసి సూపర్ విజయం అందించాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు .. ఇప్పటికే మైత్రి వాళ్లు పుష్ప 2 సినిమాతో భారీ లాభాలు అయితే అందుకున్నారు .. ఇప్పుడు ఆ లాభాలను రామ్ చరణ్ , సుకుమార్ సినిమా మీద పెట్టుబడులు పెట్టి మరింత లాభాలను ఆర్జించాలని ప్రయత్నంలో వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది .. అలాగే ఇప్పటికే వారి బ్యానర్ నుంచి వచ్చిన చాలా సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉండగా .. ఇప్పుడు సుకుమార్ రామ్ చ‌రణ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాని కూడా వాళ్లే నిర్మించడం విశేషం .. ఇక ఈ సినిమా కూడా 80, 90 స్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కబోతుందని వార్తలు బయటికి వస్తున్నాయి .. ఇక సుకుమార్ స్టోరీ మొత్తం బౌండెడ్ అయిన తర్వాత ఈ సినిమాకు సంబంధించిన అధికార ప్రకటనను తెలియజేయడానికి సిద్ధమవుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: