ఏదైనా స్టార్ హీరోల సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు సోషల్ మీడియాలో ఒక రకమైన నెగటివ్ ట్రోల్స్ వస్తున్నాయి .. స్టార్ హీరో అన్న తర్వాత ఫ్యాన్స్ తో పాటు యాంటీ అభిమానులు కూడా ఉంటారు .. అయితే విమర్శల పేరుతో ఈ మధ్య సినిమాలను ట్రోల్ చేస్తూ హెల్తి వాతావరణన్ని చెడగొడుతున్నారు .. మరోపక్క మరికొందరు సినిమాలను లిక్ చేస్తూ ఒక రకమైన పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. సినిమాను చంపేస్తే ఏమొస్తుంది అన్న ఆలోచన లేకుండా ఇలా కొంతమంది చేస్తున్న పనుల వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు .. స్టార్ హీరోల సినిమాలు విష‌యంలో జరుగుతున్న ఈ  నెగిటివ్ వార్ ఈ మధ్య మరింత పెరిగిపోయింది ..


రీసెంట్గా సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ఒక సినిమాని నెగిటివ్ ట్రెండ్స్ బాగా టార్గెట్ చేస్తూ ట్రోల్ చేశాయి .. అయితే తాజాగా దీనిపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒక సినిమాను మనమే  మన చేతులతో చంపుకుంటున్నామంటూ బాగా ఎమోషనల్ కామెంట్లు చేశాడు. ఇక దానికి మెగాస్టార్ చిరంజీవి కూడా సపోర్టుగా నిలిచాడు .. అయితే తమన్ దీనిపై ఇంత ఓపెన్ గా చెప్పాడు అంటే ఆయన ఎంతగా బాధపడ్డాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు .. ఒక్క సినిమా విషయంలో టెక్నీషియన్స్ అంతా కూడా ఎంతో కష్టపడి ఒకేలా పని చేస్తారు .  కానీ దానిని జడ్జీ చేసే అభిమానులు మాత్రం వాటిని వేరేలా తీసుకుంటారు .. అలాగే ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ఒక సినిమా పైరసీ ప్రింట్ ఏకంగా లోకల్ టీవీలో కూడా వచ్చేసిందంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.


చిత్ర పరిశ్రమలో ఉన్న పెద్దలు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఇలాంటి విషయాల మీద కఠిన చర్యలు తీసుకుంటేనే కానీ రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా ఉంటాయి .. లేకపోతే మాత్రం ఇలాంటివి మళ్లీ మళ్లీ స్టార్‌ హీరోల సినిమాలుకు రిపీట్ అవుతూనే ఉంటాయి .. అయిన కూడా ఇష్టమైన హీరో సినిమా రిలీజ్ అయితే చూసి ఆనందించాలి తప్ప అవతలి హీరో సినిమాను పాడు చేయాలి దానిమీద ట్రోల్ చేయాలి అన్నది నిజమైన అభిమాని చేసే పని మాత్రం కాదు .. ఇప్పుడు ఈ ఇష్యూ పై చిత్ర పరిశ్రమలోని పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి . ఇది ఒక సినిమాకు జరుగుతున్న అన్యాయం కాదు పరిశ్రమకు జరుగుతున్న అన్యాయం.. ఈ విధంగా సినిమాను చంపేసుకుంటూ వెళితే రాబోయే రోజుల్లో మరీ దిగజారే అవకాశం ఉంది .. ఇక మరి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను సెట్ రైట్ చేసేందుకు చిత్ర పరిశ్రమ నుంచి ఎలాంటి స్టెప్ తీసుకుంటారనేది కాలమే సమాధానం చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: