ఒక్కటంటే ఒక్క హిట్ వ‌స్తే చాలు అని ఎదురుచూసే హీరోలు చిత్ర పరిశ్రమలో చాలామంది ఉన్నారు .. అలాంటి వారిలో మహేష్ బావ సుదీర్ బాబు కూడా ఒకరు .. హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దుసుకుపోతున్నారు ఈ యంగ్ హీరో .. సంవత్సరానికి రెండు మూడు సినిమాలకు తగ్గకుండా రిలీజ్ చేస్తున్నాడు సుదీర్ బాబు .. కానీ ఈ యంగ్‌ హీరోకు ఎంతవరకు ఒక సాలిడ్ హిట్ కూడా దక్కలేదు .. సుధీర్ బాబు నటించిన సినిమాల్లో బ్లాక్ బస్టర్ సినిమా అంటే టక్కున చెప్పే మూవీ ప్రేమ కథ చిత్రం .. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది .. ఈ మూవీ హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో హీరోయిన్గా నందితా రాజ్ నటించింది .. సప్తగిరి , ప్రవీణ్ ముఖ్య పాత్రలో నటించారు.


అలాగే ఈ ప్రేమ కథ చిత్రం మూవీలో సప్తగిరి చేసిన కామెడీ సినిమాకే హైలెట్గా నిలిచింది .. అదేవిధంగా ఈ సినిమాలో హీరోయిన్గా నందితా తన అందంతో పాటు నటనతో కూడా ప్రేక్షకులను అదరగొట్టింది .. ఇక ఈ సినిమాలో నందిత అందానికి అప్పటి కుర్రాళ్లంతా ఫిదా అయ్యారు .. ఈ సినిమా తర్వాత ఎంతోమందికి ఈమె ఫేవరెట్ హీరోయిన్గా మారింది .. అలాగే ఈ మూవీ హిట్‌తో నందిత పెద్ద హీరోయిన్ అవుతుందని అంత అనుకున్నారు .. కానీ అలా జరగలేదు .. ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కలేదు.


అయితే నిజానికి తెలుగులో ఈమె తేజ దర్శకత్వం వహించిన నీకు నాకు డాష్ డాష్ అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది .. ఇక ప్రేమ కథ చిత్రం సినిమా తర్వాత నందిత వరుసగా సినిమాల్లో నటించింది .. అదేవిధంగా మరోసారి సుదీర్ బాబుతో కలిసి కృష్ణమ్మ కలిపింది సినిమాలో కూడా నటించింది .. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది .. ఇక దాంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు తగ్గాయి . అయితే ఆ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది .. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ఎలా ఉంది అని చాలామంది గూగుల్ లో తెగ వెతుకుతున్నారు .. అయితే ఇదే క్రమంలో ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండకపోవడంతో ఆమె లేటెస్ట్ ఫోటోలు ఎక్కడ సరిగ్గా కనిపించడం లేదు . అయితే ఇక మరి నందిత రాబోయే రోజుల్లో అయినా సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతుందో లేదో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: