విక్రమ్ సినిమాలో ఆఫర్ వచ్చినా సాయిపల్లవి రిజెక్ట్ చేసిందని వైరల్ అవుతున్న వార్తల సారాంశం. విక్రమ్ హీరోగా ఎస్. అరుణ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వీర వీర సూరన్ సినిమాలో సాయిపల్లవిని తీసుకోవాలనే ప్రయత్నాలు జరిగాయని భోగట్టా. అయితే సాయిపల్లవి మాత్రం వేర్వేరు కారణాల వల్ల ఈ మూవీ ఆఫర్ ను వదులుకున్నారని సమాచారం అందుతోంది.
విక్రమ్ హీరోగా నేషనల్ అవార్డ్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సాయిపల్లవి సైతం నటిగా ఆరు సినిమాలలో నటించి విజయాలను అందుకున్నారు. విక్రమ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి సక్సెస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. విక్రమ్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.
సాయిపల్లవి అమరన్ సినిమాతో గతేడాది సక్సెస్ అందుకున్నారు. సాయిపల్లవి నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే ఈ బ్యూటీకి తిరుగుండదని చెప్పవచ్చు. సాయిపల్లవి కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉందో చూడలి. తండేల్ సినిమాతో సాయిపల్లవి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. సాయిపల్లవి నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాగుంటుందని చెప్పవచ్చు. సాయిపల్లవి ఇతర భాషల్లో సైతం అంచనాలకు మించి విజయం సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. తండేల్ సినిమా ఏకంగా 90 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. సాయిపల్లవి రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.