మొదటి రోజు నుంచి సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాధ్యతలను పూర్తిగా భుజాన వేసుకున్నారు అనిల్ రావుపూడి .. అన్నీ తానేయి సినిమాను బ్లాక్ బస్టర్ విజయం చేశారు. అలాగే డాకు మహారాజ్ దర్శకుడు బాబి కూడా ఈ సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాడు .. బాలకృష్ణ అందుబాటులో లేకపోవడంతో ప్రమోషన్స్ బాధ్యత కూడా బాబియే తీసుకున్నారు .. వరుస ఇంటర్వ్యూలతో సినిమాపై హైప్ ని పెంచేశారు .. ఇలా బాబీ కష్టానికి తగ్గ ఫలితం ఇచ్చారు తెలుగు ప్రేక్షకులు.
ఒక్క దర్శకుడు అంటే కేవలం సినిమా మేకింగ్ వరకు మాత్రమే పరిమితం కాదని ఈ జనరేషన్ దర్శకులకు తెలియజేసిన దర్శకుడు దర్శధీరుడు రాజమౌళి .. రాజమౌళి సినిమా అంటే ముహూర్తం నుంచి సక్సెస్ పార్టీ వరకు అంతా ఆయనే ఉంటారు .. ప్రమోషన్స్ కూడా సినిమా మేకింగ్ అండ్ అంతగా పక్కగా ప్లాన్ చేసుకుంటారు .. అందుకే ఆయన దర్శక ధీరుడు అనిపించుకుంటున్నాడు . అయితే ఇప్పుడు రాజమౌళిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్న బాలీవుడ్ మేకర్స్ కూడా ఇదే ట్రెండు ని ఫాలో అవుతున్నారు .. రోహిత్ శెట్టి , అయాన్ ముఖర్జీ , రాజ్ కుమార్ ఇరానీ వంటి అగ్ర దర్శకులు సినిమా ప్రమోషన్ల విషయంలో కీలక పాత్ర పోషించడానికి రెడీ అవుతున్నారు.