బాలీవుడ్ ని తెలుగు చిత్ర పరిశ్రమ శాసిస్తున్న సమయంలో .. మన హీరోయిన్లు బాలీవుడ్ బాట ఎందుకు పడుతున్నారు ? నార్త్ ఇండస్ట్రీయే  సౌత్ కావాలని పరుగులు పెడుతుంటే మన హీరోయిన్లు మాత్రం బాలీవుడ్ ను ఎందుకు కోరుకుంటున్నారు ? అసలు ఈ లాజిక్ ఏంటి ? పాన్ ఇండియా సినిమాల టైంలోనూ బాలీవుడ్ బాట పట్టడానికి అసలు కారణం ఏంటి ? తెలుగు చిత్ర పరిశ్రమలో కావాల్సినంత క్రేజ్ తెచ్చుకుంటున్నారు .. ఇక్కడ ప్రేక్షకులు దర్శకులు, నిర్మాతలు వారిని నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నారు .. వారికి అడక్కుండానే క్యారెక్టర్స్ రాసే దర్శకులు కూడా ఉన్నారు .  కానీ మన హీరోయిన్ల చూపులు మాత్రం బాలీవుడ్ పైనే ఉన్నాయి ..


బాలీవుడ్ అంతా మన జపం చేస్తుంటే హీరోయిన్లు మాత్రం బాలీవుడ్ బాటపడుతున్నారు .. కీర్తి సురేష్ , సమంత , రష్మిక ఇలా అంతా ఇప్పుడు హిందీ వైపే చూస్తున్నారు. బాలీవుడ్ అంటే ఒకప్పుడు ఎంతో గొప్పగా చెప్పుకునే వాళ్ళు కానీ ఇప్పుడు అలాంటి సీన్ లేదు .. సినిమా అంత మారిపోయింది .. అక్కడ వాళ్లే మనల్ని చూసి వావ్ అంటున్నారు .. కానీ హీరోయిన్లు మాత్రం ఇప్పటికీ హిందీ వైపు పరుగులు పెడుతున్నారు .. అయితే దానికి ఒకే ఒక్క కారణం ఉంది .. అదే రెమ్యూనరేషన్ .. అవును మనకంటే బాలీవుడ్లో డబల్ పారితోషకం తీసుకుంటున్నారు హీరోయిన్లు. శ్రీవల్లి రష్మిక మందన్ననే తీసుకోండి .. మన దగ్గర ఎంత పెద్ద సినిమా చేసిన ఈమెకు 2 కోట్లకు మించి రెమ్యునరేషన్ రాదు .


అదే బాలీవుడ్ లో ఒక్క సినిమా చేస్తే 10 కోట్ల వరకు పారితోషకం అందుకుంటుందని తెలుస్తుంది .. పైగా పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ఫ్రీ .. కీర్తి సురేష్ సైతం బేబీ జాన్ కోసం భారీగానే రెమ్యూనిరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది .. ఈ సినిమా ప్లాప్ అయిన ఈ ముద్దుగుమ్మ కి ఆఫర్స్ అయితే బాగానే వస్తున్నాయి. సౌత్ లో రెండు కోట్లకు మంచి కీర్తి రెమ్యూనరేషన్ తీసుకోలేదు .. కానీ బాలీవుడ్ లో మాత్రం డబల్ అయింది .. సమంత కూడా సౌత్ సినిమాలతో పోలిస్తే నార్త్ లో చేసే వెబ్ సిరీస్‌లతోనే ఎక్కువగా కూడ బెడుతుంది. వీరే కాకుండా రెజీనా, రాశీ కన్నా లాంటి హీరోయిన్లు కూడా బాలీవుడ్ లో భారీ రెమ్యూనిరేషన్ అందుకుంటున్నారు.   అదే విధంగా సన్నీడియోల్ జాట్‌లో  రెజీనా హీరోయిన్ . ఇలా వారి రెమ్యూనిరేషన్ కోసం సౌత్ ను వదిలేసి నార్త్ వైపు పరుగులు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: