కానీ ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గానే మొదలుపెట్టినట్టు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది . కల్కి పార్ట్ 1న్ లో కేవలం ఈ సినిమాలోని పాత్రలను పరిచయం చేసిన నాగ్ అశ్విన్ రెండో భాగంలో అసలు స్టోరీని రివిల్ చేయబోతున్నట్లు చాలా ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చాడు .. అలాగే ఇప్పుడు పార్ట్ 2 పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి .. ఆ పార్ట్ 2 విషయంలో నిర్మాత అశ్విని దత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి .. రీసెంట్గా జరిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కల్కి నిర్మాత అశ్విని దత్ సంచలన వ్యాఖ్యలు చేశారు .. అయితే పార్ట్ 2 లో ఇప్పటివరకు ప్రభాస్ వర్సెస్ కమలహాసన్ సీన్స్ ఊహించని రేంజ్ లో ఉంటాయని తెలిసింది .. కానీ వీరితో పాటుగా బాలీవుడ్ హీరో అమితాబచ్చన్ ఈ ముగ్గురు మధ్య కీలక సన్నివేశాలు ఉండబోతున్నాయని టాక్ ..
ఇక మరో విషయం ఏమిటంటే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైందని నిర్మాత అశ్వినీదత్ చెప్పారు .. ప్రభాస్ లేని పలు కీలక సన్నివేశాలను కల్కి చిత్ర యూనిట్ తెరకెక్కిస్తున్నారట .. ఇప్పటికే పలు భారీ సెట్టింగ్స్ ఉన్నయని ఇలా వాటిలో షూటింగ్ చేసినట్లుగా తెలుస్తుంది .. అలాగే శోభన , దీపికా పదుకొనే కూడా లాస్ట్ లో జాయిన్ అవుతారని ఆయన అన్నారు .. దీపిక కూడా ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చింది .. ఆ బిడ్డతో ఎక్కువగా సమయం గడుపుతుంది .. ఇప్పుడు ఈ అవైటెడ్ సీక్వెల్ ని మాత్రం మేకర్స్ పక్క ప్లానింగ్ తో పాన్ ఇండియా వైడ్ గా ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ ఇచ్చే విధంగా తెరకెక్కిస్తున్నారని కూడా చెప్పాలి .. అలాగే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్టు కూడా తెలుస్తుంది .. మెయిన్ లీడ్ రోల్స్ కాస్త పెండింగ్ ఉన్నాయని కూడా అంటున్నారు వచ్చే ఏడాది జూన్ లోనే ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని కూడా నిర్మాత అంటున్నారు .. ఈ సినిమా షూటింగుకు సంబంధించిన అప్డేట్ కూడా త్వరలోనే బయటకు రానుందని కూడా టాక్.