ప్రముఖ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తాజాగా ఒక సందర్భంలో చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. పలు అంతర్జాతీయ, జాతీయ బ్రాండ్లకు ఆమె మోడల్ గా వ్యవహరిస్తున్నారు. సచిన్‌టెండూల్కర్‌ ఫౌండేషన్‌ కు సైతం ఆమె డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
 
తాజాగా సారా టెండూల్కర్ మాట్లాడుతూ నాకు చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాలలో పాల్గొనాలనే ఆసక్తి ఎక్కువని అన్నారు. సమాజానికి మన వంతుగా ఎంతో కొంత తిరిగివ్వాలని నాన్న చెబుతూ ఉండేవారని ఆమె చెప్పుకొచ్చారు. నిజానికి అమ్మ, నాన్న నుంచి నేను దాతృత్వ గుణాన్ని అలవరచుకున్నానని సారా టెండూల్కర్ కామెంట్లు చేశారు. మా ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలకు సహాయం చేస్తున్నామని ఆమె తెలిపారు.
 
మారుమూల ప్రాంతాల్లో నివశిస్తున్న పేద పిల్లలకు ఉచిత వైద్యం, క్రీడలు, నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకుంటున్నామని సారా టెండూల్కర్ పేర్కొన్నారు. టీనేజ్ లో ఉన్న సమయంలోనే పీసీఓఎస్ బారిన పడ్డానని ఫేస్ నిండా మొటిమలు వచ్చాయని ఆ మొటిమలను తగ్గించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదని కామెంట్లు చేశారు.
 
చివరకు నా లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకోవాలని అనుకున్నానని సారా టెండూల్కర్ పేర్కొన్నారు. నెమ్మదిగా బరువు తగ్గడం మొదలుపెట్టానని ఆమె అన్నారు. తరచుగా నీళ్లు తాగుతూ ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకున్నానని సారా చెప్పుకొచ్చారు. సహారా కప్ కనెక్ట్ అయ్యేలా నాన్న నాకు సారా అని పేరు పెట్టారని ఆమె వెల్లడించారు. నా సీక్రెట్స్ అన్నీ నా తమ్ముడికి తెలుసంటూ సారా టెండూల్కర్ ఒకింత సంచలన వ్యాఖ్యలు చేశారు. సారా టెండూల్కర్ కెరీర్ పరంగా సక్సెస్ సాధించడంతో పాటు మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.




మరింత సమాచారం తెలుసుకోండి: