ఇండస్ట్రీలో గురువుగా భావించే దాసరి నారాయణరావు కీ వీరాభిమాని మోహన్ బాబు.. దాసరి నారాయణరావు అనారోగ్యంతో 2017లో మరణించారు. దాసరి నారాయణ ఇద్దరు కొడుకులు దాసరి అరుణ్, దాసరి ప్రభు కూడా తండ్రి మరణించేంతవరకు కూడా సైలెంట్ గా ఉండి ఆ తర్వాత ఆస్తులు కావాలి అంటూ ఇద్దరూ రోడ్డుకెక్కారు. సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది సమస్యలను పరిష్కరించినటువంటి దాసరి నారాయణ రావు గారు ఆయన కుటుంబంలో ఇలాంటి ఆస్తి తగాదాలు రావడంతో ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిందట.
ఆస్తి తగాదాలతో ఇబ్బంది పడుతున్న సమయంలో మోహన్ బాబు, మురళీమోహన్ వంటి నటులు జోక్యం చేసుకొని ఆ గొడవను సర్దు మునిగేలా చేశారు.ఇండస్ట్రీ పెద్దగా ఉన్న దాసరి గారి పరువు మొత్తం ఇద్దరు కుమారులు తీశారు ఇప్పుడు ఇదే పరిస్థితి శిష్యుడు అయిన మోహన్ బాబుకు కూడా ఎదురయ్యింది కొడుకుల ఇద్దరూ కూడా ఆస్తి గొడవ కోసం పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కారు. సినిమాల పరంగా పెద్దగా మోహన్ బాబు సంపాదించి లేదు కానీ విద్యాసంస్థల పరంగా బాగానే సంపాదించారు. ఇటీవలే మంచు మనోజ్ కు రెండో వివాహం అయినప్పటి నుంచి ఈ గొడవలు కాస్త ఎక్కువ అయ్యాయట. దీంతో తండ్రి కొడుకుల మధ్య వార్ రోజు రోజుకి పీక్ స్టేజ్ కి వెళ్ళిపోతోంది. ఏది ఏమైనాప్పటికీ గురువు శిష్యులకు కొడుకుల వల్ల ఇబ్బందులు తలెత్తాయి.