నందమూరి బాలకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అతి చిన్న వయసులోనే సినిమాల్లోకి హీరోగా పరిచయమయ్యాడు. బాలకృష్ణ తనదైన నటన, పంచ్ డైలాగ్స్ తో అభిమానులను ఆకట్టుకున్నారు. బాలకృష్ణకు విపరీతంగా అభిమానులు ఉన్నారు. తన సినిమా వచ్చిందంటే చాలు అభిమానులు ఎంతగానో ఆసక్తిని చూపిస్తారు. బాలకృష్ణ ప్రతి సంవత్సరం ఏదో ఒక సినిమాతో తన అభిమానులను అలరించడానికి సిద్ధమవుతూనే ఉంటారు. ఇప్పటివరకు బాలకృష్ణ నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి.
ముఖ్యంగా అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బాలకృష్ణ 100 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం డాకు మహారాజ్. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో బాలకృష్ణ మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. 64 ఏళ్ల వయసులోను బాలకృష్ణ ఎంతో యాక్టివ్ గా, చురుగ్గా ఉంటారు.
దానికి గల ప్రధాన కారణం ఆయన ఫిట్నెస్. బాలకృష్ణ తన ఫిట్నెస్ విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తారు. ముఖ్యంగా ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. తాను ఫిట్ గా ఉండడానికి గల ప్రధాన కారణాన్ని షేర్ చేసుకున్నాడు. షూటింగ్ సమయంలో కేవలం ప్రొడక్షన్ ఫుడ్ మాత్రమే తింటానని వెల్లడించాడు. డాకు మహారాజ్ ప్రమోషన్ ఈవెంట్ లో భాగంగా ఆయన ఈ విషయాలను షేర్ చేసుకున్నాడు. ఫుడ్ విషయంలో తన భార్య వసుంధర తనని ఎప్పుడూ తిడుతుందని అన్నాడు. కాగా...పార్టీలకు, కులాలకు అతీతంగా తనకు ఫ్యాన్స్ ఉన్నారని బాలకృష్ణ చెప్పారు.
అదే తాను సంపాదించిన ఆస్తి అంటూ బాలయ్య బాబు తెలిపారు. బాలకృష్ణ నటించే తదుపరి చిత్రం అఖండ-2. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొన్ని షాట్లను చిత్రీకరించారని సమాచారం అందుతోంది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని బాలకృష్ణ అభిమానులు సంబరపడుతున్నారు.