వరల్డ్స్ బ్లాక్‌బస్టర్ మూవీ పుష్ప-2 నుంచి కొన్ని రోజుల "గంగమ్మ జాతర" పాట ఫుల్ వీడియో యూట్యూబ్ వేదికగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పాట టి-సిరీస్ యూట్యూబ్ ఛానల్‌లో అందుబాటులో ఉంది. దీన్ని చూస్తుంటే పూనకాలు వస్తున్నాయని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. విడుదల కావడంతోనే ఈ పాట విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్ రాసిన సాహిత్యం "గంగు రేణుకా తల్లి"కి ఘన నివాళి అర్పిస్తోంది. మహాలింగం తన శక్తివంతమైన గాత్రంతో పాటకు ప్రాణం పోశారు.

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ పాటకు టెరిఫిక్ మ్యూజిక్ సంగీతం అందించారు. ఆయన అందించిన ఎలక్ట్రిఫైయింగ్ ట్యూన్స్‌కు అభిమానులు, విమర్శకులు ఫిదా అవుతున్నారు. ఈ పాటలోని ఎనర్జిటిక్ బీట్స్, హృదయాన్ని హత్తుకునే కూర్పు అందరినీ మెప్పిస్తోంది. ఇక ఈ పాటలో అల్లు అర్జున్ డ్యాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన యాక్టింగ్, ఎక్స్‌ప్రెషన్స్‌, డ్యాన్స్‌ ఔట్ స్టాండింగ్‌గా ఉందని అంటున్నారు. ఈ పాటలోని సీక్వెన్స్‌లో ఆయన హావభావాలు నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయని ప్రశంసిస్తున్నారు. విమర్శకులు, ప్రేక్షకులు సైతం అల్లు అర్జున్ నటనకు బ్రహ్మరథం పడుతున్నారు.

ఈ పాట సినిమాకే పరిమితం కాలేదు. ఒక ఫ్యాన్ ఇటీవల "గంగమ్మ జాతర" సన్నివేశాన్ని రీక్రియేట్ చేశాడు. చీర కట్టుకుని, ముఖానికి రంగులు వేసుకుని, దేవతలాగా గుడిలో డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతని పెర్ఫార్మెన్స్ చూసిన నెటిజన్లు "అదిరిపోయేలా స్టెప్పులు వేసావ్ భయ్యా, అచ్చం అల్లు అర్జున్ ని దింపేశావు" అని కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది ఈ వీడియోను షేర్ చేస్తూ, పాటకి, అల్లు అర్జున్ నటనకు ఇది కిల్లింగ్ ట్రిబ్యూట్ అని కొనియాడుతున్నారు. గూస్‌ బంప్స్ వస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.

మొత్తానికి "గంగమ్మ జాతర" పుష్ప-2లోని ప్రధాన హైలైట్స్‌లో ఒకటిగా నిలిచింది. శక్తివంతమైన సంగీతం, ఎమోషనల్ లిరిక్స్, అల్లు అర్జున్ అద్భుతమైన నటన కలగలిసిన ఈ పాట అభిమానులకు ఒక గొప్ప ఫీలింగ్ కలిగిస్తోంది. సాంస్కృతిక ప్రాధాన్యత, కళ్లు చెదిరే విజువల్స్‌తో ఈ పాట అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేస్తుంది. ఇది అల్లు అర్జున్ కెరీర్‌లో చెప్పుకోదగిన బెస్ట్ సాంగ్ అని అభిమానులు నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: