టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఈ క్రమంలో మంచు కుటుంబం డ్రీమ్ ప్రాజెక్టు అయిన కన్నప్ప మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. శివుడికి వీరభక్తుడైన కన్నప్ప జీవితచరిత్ర అధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అన్ని భాషల నుంచి అగ్ర నటులు నటిస్తుండటం విశేషం. కన్నడ నుంచి శివరాజ్‌ కుమార్‌, మలయాళం నుంచి మోహన్‌లాల్‌ తమిళం నుంచి శరత్‌ కుమార్‌ నటిస్తున్నారు.ఇక తెలుగు నుంచి ప్రభాస్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా స్టార్ ప్లస్‌లో మహాభారతం సీరియల్‌ని తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్ రేంజ్‌లో నిర్మిస్తున్న ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు.

ఇందులో భాగంగా అంతర్జాతీయ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెచా ఫైట్స్ చేస్తుండగా.. పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ చిత్ర కథకి కీలక మెరుగులు దిద్దారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి భారీ తారాగణంతో పాటు సాంకేతిక వర్గంతో ఓ రేంజ్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీతో ఎలాగైనా పానఇండియా రేంజ్‌లో సూపర్ హిట్ కొట్టాలని మంచు విష్ణు గట్టి పట్టుదలతో ఉన్నాడు.ఈ సందర్బంగా తాజాగా ఈ సినిమా కథ ఐడియా పై విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కన్నప్ప సినిమా ఏడెనిమిదేళ్లుగా తన ప్లానింగ్‌లో ఉందని అయితే, బడ్జెట్ కారణాల వల్ల ఇప్పుడు కుదిరిందని అలాగే అసలు ఈ సినిమాకు ఐడియా తనికెళ్ల భరణి ఇచ్చారని హీరో మంచు విష్ణు చెప్పారు.ఇదిలావుండగా మరోవైపు ఈ సినిమాలో బాలీవుడ్‌ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా ఒక కీలకపాత్రలో నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్యాన్ ఇండియా సినిమాలో ప్యాన్ ఇండియా స్టార్స్‌ను తన సినిమాలో నటింపచేస్తే  మంచి ఓపెనింగ్స్ వస్తాయని నమ్ముతున్నారట. అందులో భాగంగా ఇప్పుడు అక్షయ్ కుమార్ కూడా ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లో నటిస్తున్నట్టు సమాచారం. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.

మరింత సమాచారం తెలుసుకోండి: