సౌత్ ఇండియా సినిమా దగ్గర వచ్చిన పలు సెన్సేషనల్ హిట్ చిత్రాల్లో మళయాళ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ప్రేమలు కూడా ఒకటి. మలయాళం లో ఫిబ్రవరి 9 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను తెలుగు లో రాజమౌళి తనయుడు ఎస్. ఎస్. కార్తికేయ మార్చి 8 న రిలీజ్ చేశాడు. ఇక్కడ కూడా ఈ యూత్ లవ్ స్టోరీ మంచి హిట్ ను అందుకుంది.ఇదిలావుండగా ఈ సినిమాలో నాస్లన్ కే గఫుర్ హీరోగా మమిత బైజు హీరోయిన్ గా నటించగా గిరీష్ ఎడి దర్శకత్వం వహించారు.ఇక ఈ సినిమా తరువాత మమితాకు తెలుగు లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అయితే ఈ రోమ్ కామ్ డ్రామా తెలుగు లో వచ్చి కూడా సాలిడ్ వసూళ్లు రాబట్టింది.ఇక ఇదే లైన్ తో గిరీష్ ఈ సినిమాకు సీక్వెల్ మొదలుపెట్టాడు. ప్రేమలు 2 ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

గతకొన్నిరోజులుగా నస్లెన్ గఫూర్ తోనే గిరీష్ మరో సినిమాను తెరకెక్కిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమానే ప్రేమలు సీక్వెల్ అని తెలుస్తోంది. దీంతో ఈ సీక్వెల్ పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఈ కథ లో ప్రేమ లో ఉండే కోపాలు, అలకలు, చిరాకులు ఇలాంటివన్నీ చూపించనున్నాడట గిరీష్.ప్రస్తుతం ‘ప్రేమలు 2’ ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్లో నడుస్తున్నాయట. ఈ ఏడాది జూన్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని వినికిడి. షూటింగ్ అనుకున్న టైంకి కంప్లీట్ అయితేఈ ఏడాది చివర్లో మలయాళం తో పాటు తెలుగులో కూడా ఏకకాలంలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.మరి ఈ సినిమాతో ఈ టీమ్ మరో హిట్ ను అందుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: