టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒకప్పుడు తన అందం తో కుర్రకారుకు చెమటలు పట్టించిన భామల్లో భువనేశ్వరి ఒకరు. భువనేశ్వరి దక్షిణాది నటి 4 జూన్ 1975 లో జన్మించింది. ఈమె తెలుగు,  తమిళ భాషలలో 50 కంటే ఎక్కువ చిత్రాలలో నటించిన ప్రముఖ నటి.దొంగ రాముడు అండ్ పార్టీ, గుడుంబా శంకర్, చక్రం, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, సీమ శాస్త్రి, ఆంజనేయులు వంటి సినిమాల్లో ఆమె తన బ్యూటీతో అలరించింది. పలు తమిళ చిత్రాల్లో సైతం  మెరిసింది. ఆ తర్వాత వెండితెరకు దూరమై తమిళనాట పలు సీరియల్స్‌లో నటించింది. 2015 తర్వాత నుంచి ఆమె అటు సిల్వర్ స్క్రీన్‌పై, ఇటు బుల్లితెరపై కనిపించలేదు. సినిమాలలో అవకాశాలు దొరక్క సీరియల్స్‌లో నటించిన భువనేశ్వరి ఏదోలా కష్టపడి సీరియల్స్‌లో అవకాశాలు సంపాదించుకుంది. వచ్చే డబ్బు చాలక అడ్డదార్లు తొక్కింది.ఏపీలోని చిత్తూరుకు చెందిన భువనేశ్వరి యాక్టింగ్‌పై ఇంట్రస్ట్‌తో తొలుత మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది.ఆ టైంలో ఈమెకు ఓ హీరోతో పరిచయమవ్వడం, హీరోయిన్ ఛాన్స్ ఇస్తాను అంటే నమ్మి మోసపోవడం జరిగింది.అంతేకాదు అప్పట్లో ఒక ప్రముఖ నిర్మాత ఈమెపై చీటింగ్ కేసు వెయ్యడం ఆరోజుల్లో సెన్సేషన్. ఆ తర్వాత ఈమె నటనకు గుడ్ బై చెప్పింది. అటు సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంది. తాజాగా ఆమె తిరుమలకి వచ్చింది. తొలుత ఆమెను అక్కడి మీడియా ప్రతినిధులు సైతం గుర్తుపట్టలేదు. ఎవరో వ్యక్తి చెప్పడం తో ఆమే తెలిసి కంగుతిన్నారు. మత్తెకించే అందాలతో అప్పట్లో ఓ ఊపు ఊపేసిన భువనేశ్వరి, వయస్సు మీదపడటంతో ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.ఈమె లేటెస్ట్ లుక్ అంటూ ఓ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇది లేటెస్ట్ వీడియో కాదు. రెండేళ్ల క్రితం వీడియో. అయినా సరే ఈమె లుక్ చాలా అంటే చాలా ఘోరంగా ఉందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: