తాజాగా ఆయన నటించిన "మదగదరాజా" సినిమా ఈవెంట్ లో విశాల్ వీడియో ఒకటి బయటకు రావడంతో అది పెద్ద చర్చకు దారితీసింది. ఎప్పుడు ఫిట్ గా, యాక్టివ్ గా ఉండే విశాల్ అనారోగ్యంగా కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. చివరికి విశాల్ చేతిలో మైక్ పట్టుకున్నప్పటికీ అతని చేతులు వణకడంతో విశాల్ అభిమానులు తీవ్రంగా ఆందోళనకు గురయ్యారు. అతనికి ఏమైంది అంటూ ఆరా తీశారు.
అయితే విశాల్ కు ఎలాంటి సమస్యలు లేవని, అతను బాగానే ఉన్నారని, కేవలం వైరల్ ఫీవర్ సమస్యతో బాధపడుతున్నాడని చిత్ర బృందం చెప్పింది. డెంగ్యూ రావడం వల్ల విశాల్ పూర్తిగా అలా మారిపోయారు అంటూ చిత్ర బృందం వెల్లడించారు. అయితే కొద్దిరోజుల సమయంలోనే హీరో విశాల్ పూర్తిగా కోలుకున్నారు. ఈవెంట్ సమయంలో అనారోగ్యంతో బాధపడుతూ నడవలేని పరిస్థితుల్లో ఉన్న హీరో విశాల్ ఇప్పుడు డ్యాన్సులు వేసి సందడి చేశారు.
నిన్న జరిగిన విజయ్ ఆంటోనీ కన్సర్ట్ లో విశాల్ పాల్గొని "మై డియర్ లవరు" పాట పాడుతూ ఎంతో హుషారుగా కనిపించాడు. "నాక ముక్క" పాట స్టెప్పులు వేశారు. తన అభిమాన హీరోను అలా చూసిన అభిమానులు సంతోషంతో కేకలు వేయడం ప్రారంభించారు. "మదగజరాజ"సినిమా ఈవెంట్ లో హీరో విశాల్ వణుకుతూ మాట్లాడలేకపోయినా సంగతి తెలిసిందే. ఇప్పుడు అతను పూర్తిగా కోల్పోవడంతో అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.