మన పాతకాలం రోజుల్లో సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు ఎడ్లబండలోనూ, ట్రాక్టర్ల పై థియేటర్లకు వచ్చేవారు .. మన పాత రోజుల్లో ట్రావెలింగ్ సదుపాయం లేని రోజుల్లో ఇలాంటి సన్నివేశాలు ప్రతి స్టార్ హీరో సినిమాకు కనిపించేవి .. తర్వాత కాల క్ర‌మంలో వాహనాలు పెరగడంతో ఈ కల్చర్ కనిపించకుండా పోయింది .. ఆ తర్వాత మళ్లీ నటసింహం బాలకృష్ణ నటించిన సినిమాలు రిలీజ్ అయితే థియేటర్ల వద్ద అప్పుడప్పుడు ఇలాంటి సన్నివేశం కనిపిస్తూ ఉండేది. బాలయ్య హీరోగా వచ్చిన అఖండ సినిమా రిలీజ్ అయిన సమయంలో ఆంధ్రప్రదేశ్లో కొన్నిచోట్ల ట్రాక్టర్ల పై సినిమాకు వచ్చిన సందర్భాలు కనిపించాయి .. ఐదు సంవత్సరాల క్రితం వచ్చిన అఖండ వచ్చినప్పుడు ఆ సమయంలో తూర్పుగోదావరి జిల్లా తుని శ్రీ రామ థియేటర్ వద్ద ఇదే సన్నివేశం కనిపించింది ..


ఓ 10 ట్రాక్టర్ల పై సినిమా కోసం బండనక బండి కట్టి జనాలంతా టిక్కెట్ల కోసం ఎగబడ్డారు .. ఆ తర్వాత భగవంత్ కేసరి రిలీజ్ అయిన స‌మ‌యంలో కూడా ఇలాంటి సన్నివేశం రాష్ట్రంలో పలు థియేటర్ల వద్ద కనిపించింది. అయితే ఆ తర్వాత మళ్లీ ఏ హీరో సినిమాకు ఈ విధంగా ట్రాక్టర్లు వేసుకుని ప్రేక్షకులు తరలి రాలేదు .. అయితే ఇప్పుడు మళ్లీ తాజాగా సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కోసం మాత్రం అలాంటి సన్నివేశం రీసెంట్గా మరోసారి కనిపించింది .. కాకినాడ జిల్లా తునిలోని శ్రీరామ థియేటర్ వద్ద థియేటర్‌కు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ట్రాక్టర్ల పై సినిమా చూడడానికి వచ్చారు .. అలా ఆ టాక్టర్లు రోడ్డు మీద ఆపి కౌంటర్ వద్దకు టికెట్లు కొనడానికి వెళ్లిన ఎలాంటి లాభం లేకుండా పోయింది ..


ఇక అప్పటికే థియేటర్ హౌస్ ఫుల్ అయింది. ఇక దాంతో ఎంతో ఆశతో ట్రాక్టర్ మీద వచ్చిన వారు వెనక్కు తిరిగి వెళ్లిపోయారు .. వెంకటేష్ సినిమా చూడాలని ఎంతో ఆశతో వచ్చిన వారికి నిరాశ మిగిలింది .. ఇదే క్రమంలో టికెట్ ధరల ఇష్యూ కూడా ఈ గ్రామ వాసుల్లో పెద్ద చర్చకు వచ్చింది .. సినిమా టికెట్ ధర ఎక్కువగా ఉందని అంత ధరతో తమలాంటి ప్రజలు సినిమా చూడలేరని .. వీలైనంత త్వరగా ధరలు తగ్గించాలని వారి కోరారు .. ఇదే క్రమంలో బాలకృష్ణ తర్వాత వెంకటేష్ కోసం ట్రాక్టర్ల పై ప్రేక్షకులు తరలివచ్చారని అక్కడి స్థానిక ప్రజలు మాట్లాడుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది .

మరింత సమాచారం తెలుసుకోండి: