అక్కినేని నాగార్జున గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. సినీ కుటుంబంలో ఉన్న గొప్ప కుటుంబాలలో అక్కినేని కుటుంబం ఒకటి. అక్కినేని నాగేశ్వరరావు ఇండస్ట్రీలో తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఆ తర్వాత నాగేశ్వరరావు వారసుడిగా అక్కినేని నాగార్జున ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇండస్ట్రీలో తన కంటూ మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ముఖ్యంగా మన్మధుడిగా తన నటన, అందంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాడు. 


నాగార్జున వయసు పెరిగినప్పటికీ ఏమాత్రం ఆగకుండా వరుసపెట్టి సినిమాలలో నటిస్తూ సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగుతున్నాడు. సీనియర్ హీరోయిన్లతో పాటుగా యంగ్ హీరోయిన్ల సరసన ఆడి పాడాడు. వయసు పెరిగినప్పటికీ ఏమాత్రం తరగతి అందం, ఫిట్నెస్ తో ప్రతి ఒక్క అమ్మాయి కలల రాకుమారుడిగా మారిపోతున్నాడు. నాగార్జున తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో నటించారు. అయితే నాగార్జున ఏవో కొన్ని కారణాల వల్ల వదులుకున్న సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయట.

దళపతి సినిమాలో రజనీకాంత్ క్యారెక్టర్ చేయాలని మణిరత్నం ముందుగా నాగార్జున వద్దకు వెళ్లారట. కానీ ఏవో కారణాలవల్ల నాగార్జున చేయలేదట. కానీ ఆ సినిమా సూపర్ హిట్ అయింది. మెకానిక్ అల్లుడు సినిమాలో చిరంజీవి పాత్రను నాగార్జున చేయాల్సి ఉందట. కానీ బి.గోపాల్ తో గతంలో తాను చేసిన సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో ఆ సినిమాను చేయనని నాగార్జున తిరస్కరించారట. వీటితో పాటు వెంకటేష్ నటించిన కలిసుందాం రా, మణిరత్నం చేసిన ఘర్షణ, పూరి జగన్నాథ్ బద్రి, మౌనరాగం తదితర సినిమాలను నాగార్జున వదులుకున్నారట.

పూరితో నాగార్జున తర్వాత సూపర్, శివమణి సినిమాలు చేశారు. బద్రి సినిమాను నాగార్జునతో చేయాలని పూరి జగన్నాథ్ ఎంతగానో ప్రయత్నించారట. కానీ ఆ కాంబినేషన్ లో సినిమా సెట్ కాలేదు. చివరికి పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ సినిమాను అందించారు. ఇదే కాకుండా నాగార్జున చాలా సినిమాలను వదలుకున్నారట. ఆ సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: