ఎవరికీ ఎప్పుడు కాలం కలిసి వస్తుందో ఎవరికీ తెలియదు .. ఎవరీ టైం వచ్చినప్పుడు వారు దూసుకుపోతూ ఉంటారు .. 2021లో అఖండ సినిమా వచ్చేవరకు నట సింహం బాలయ్య కెరీర్లో ఆరడజను ప్లాప్ లు , డిజాస్టర్లు ఉంటే ఒక హిట్‌ ఉండేది .. అలాగే పెద్దగా రెమ్యూనరేషన్ కూడా ఉండేది కాదు .. సీనియర్ హీరోలలో చిరంజీవి తర్వాత అప్పటికి బాలయ్యదే పై చేయి .. అయినా కూడా 8 కోట్లు దాటలేదు.
 

అఖండ సినిమాకు బాలయ్య రెమ్యూనరేషన్ 8 కోట్లు .. దాని తర్వాత వచ్చిన వీర సింహారెడ్డి సినిమాకి కూడా ముందుగా 8 కోట్లు అనుకున్నప్పటికీ సినిమా చివరలో 12 కోట్లు వచ్చినట్లు టాక్ .. ఆ తర్వాత వచ్చిన భగవంత్‌ కేసరి సినిమాకు బాలయ్య 18 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది .. ఇక ఇప్పుడు తాజాగా సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు వచ్చిన డాకు మహారాజ్ సినిమా కోసం బాలకృష్ణ 27 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ..

 

అలాగే అఖండ 2 సినిమా కోసం కూడా బాలయ్య 35 కోట్ల వరకు కాస్త అటు ఇటుగా రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారని తెలుస్తుంది .. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మల్లిని దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం కూడా బాలయ్య 40 కోట్ల వరకు తీసుకుంటారని సమాచారం. అంటే ఇదంతా జస్ట్ 2021 నుంచి 25 మొదటి లోగా జరగపోయింది .. జస్ట్ నాలుగు సంవత్సరాలలో ఇంత మారిపోయింది .. దీన్నే టైం అంటారు .. అలాగే శుక్ర మహాదశ అంటారు , కొంద‌రు అదృష్టమంటారు ఎవరికి తోచిన పేరుతో వారు పిలుస్తూ ఉంటారు. మన సీనియర్ హీరోల్లో నాగార్జున , వెంకటేష్ ఈ రేంజ్ కు ఇంకా రాలేదు .. రవితేజ కూడా 30 కోట్ల లోపే ఉన్నారు .. ఒక్క మెగాస్టార్ మాత్రం కాస్త పైన ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: