టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో అందాల భామ హన్సిక మోత్వాని ఒకరు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించిన హన్సిక ఇండస్ట్రీకి పరిచయమే 15 సంవత్సరాలు దాటిపోయింది. ఇన్నాళ్లలో స్టార్ హీరోయిన్ గా సుదీర్ఘ కాలం పాటు తన హవాను కొనసాగించింది. తెలుగులో స్టార్ హీరోలతో చాలామంది సరసన హీరోయిన్ గా నటించింది. 

దేశముదురు సినిమా అనంతరం హన్సికకి వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. దేశముదురు సినిమాలో తన అమాయకమైన నటన, అందంతో అభిమానులను ఆకట్టుకుంది. 2011 సంవత్సరంలో సూరజ్ దర్శకత్వం వహించిన మాపిళ్ళై సినిమాతో తమిళ సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. తెలుగు, తమిళ భాషలో హన్సికకు అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు వచ్చింది. దాంతో హన్సికతో సినిమాలు చేయడానికి ప్రతి ఒక్కరు ఆసక్తిని చూపించారు.

తెలుగులో ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ, రామ్ పోతినేని, అల్లు అర్జున్ లాంటి హీరోల సరసన హీరోయిన్ గా చేసింది. అంతేకాకుండా తమిళంలోనూ స్టార్ హీరోలతో నటించింది. హన్సిక చేతినిండా సినిమాలతో బిజీగా సమయాన్ని గడుపుతున్న సమయంలోనే ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సోహైల్ కతురియాను వివాహం చేసుకుంది. కాగా, హన్సిక త్వరగా ఎదగడానికి హార్మోన్ ఇంజక్షన్స్ వాడారని అనేక రకాల రూమర్స్ వచ్చాయి. అయితే త్వరగా హైట్ పెరగడానికి ఆమె హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందని వార్తలు తెరపైకి వచ్చాయి.

అయితే ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చింది హన్సిక. ఆ వార్తలలో ఎలాంటి నిజం లేదని హన్సిక చెప్పింది. హీరోయిన్ కావడం వల్ల విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొన్నానని హన్సిక తెలిపింది. 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తనపై అలాంటి పనికిరాని వార్తలు రాశారని హన్సిక సీరియస్ అయింది. ఇక ఈ వార్తలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి. కాగా హన్సిక ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: