అందులో భాగంగానే మురగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు .. ఇది భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఈ సినిమాపై భారీ అంచనాలైతే ఉన్నాయి .. తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని కూడా అన్ని భాషల్లో రిలీజ్ చేయాలని రెడీ చేస్తున్నారు. అదేవిధంగా శివ కార్తికేయన్ 25వ సినిమాను కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెర్కక్కుతుంది .. ఈ సినిమాని కూడా ఓ బయోగ్రాఫికల్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు .. కొన్ని నిజ సంఘటనలు ఆధారంగా దర్శకుడు కథను సిద్ధం చేశారు .. ఈ సినిమాని కూడా దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో నిర్మించడానికి నిర్మాతలు ముందుకు వచ్చారు . ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది . అలాగే మలయాళ హీరో టివినో థామస్ ఏఆర్ఎమ్ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టాడు .. 30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టింది.
అలాగే కేజిఎఫ్ హీరో రాక్ స్టార్ యశ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ టాక్సిక్ .. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయి అనేది కొత్తగా చెప్పాల్సిన పని లేదు .. సౌత్ నుంచి నార్త్ వరకు అన్ని ఇండస్ట్రీలోనూ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. అక్కినేని హీరో నాగ చైతన్య తండేల్ సినిమాతో పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తున్నాడు .. చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కూడా వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కిస్తున్నారు .. ఫిబ్రవరి 7న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది .. ఈ సినిమా రిలీజ్ తర్వాత చైతన్య కూడా మరో పాన్ ఇండియా సినిమాను ప్రకటించే అవకాశం ఉంది. నేటితరం హీరోలు కూడా పాన్ ఇండియా స్టోరీలు తోనే ప్రేక్షకులు ముందుకు రావడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.