టాలీవుడ్ సినిమాల ప్రచారాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమా లాంచింగ్ కి ముందే ప్రచారాలు ఒక రేంజ్ లో జరుగుతాయి.  ఇక ఆ తర్వాత టైటిల్ అంటూ, టీజర్ అంటూ చాలానే ఉంటాయి. మళ్లీ మధ్య మధ్యలో సాంగ్స్ రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నింపుతారు. అయితే ఈ క‌ల్చ‌ర్ ను మాత్రం టాలీవుడ్ సినీ పరిశ్రమకి మహేష్ బాబు యే ప‌రిచ‌యం చేశాడు.
సూప‌ర్ స్టార్ మ‌హేష్ - ముర‌గదాస్ కాంబోలో వచ్చిన స్పైడ‌ర్ సినిమా తో ఈ కల్చర్ మొదలైంది. ఇలా ప్రీటీజ‌ర్ రిలీజ్ చేయ‌డంతో జనాల్లోకి బాగా వెళ్ళింది. దీంతో అప్పటినుండి వచ్చిన ప్రతి సినిమా ఇదే పద్దతి ఫాలో అవుతుంది. దాంతో ఇప్పుడు సినిమా ప్రచారంలో ప్రిన్స్ ట్రెండ్ ఫాలో అవ్వడు.. సెట్ చేస్తాడు అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. మహేష్ బాబు, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబోలో ఎట్టకేలకు సినిమా రాబోతుంది. ఎస్ఎస్ఎంబి 29 మూవీ పూజా కార్యక్రమం కూడా ఇటీవల మొదలైంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. అది ఏంటంటే మహేష్ బాబు, జక్కన్న కాంబోలో వస్తున్న ఈ సినిమాలో ఒక 20 నిమిషాలు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని టాక్ వినిపిస్తుంది.
ఇక ఈ సినిమాలో ఆ 20 నిమిషాలు వైల్డ్ ఫైర్ అటాక్ సీన్ ఉంటుందని తెలుస్తోంది. ఆ సీన్ కి థియేటర్స్ మొత్తం షేక్ అయిపోవాల్సిందే అంటూ టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ 20 నిమిషాల సీన్ లో మంటల్లో నటించాల్సి ఉంటుందని సమాచారం. అంతేకాదు ఈ సీన్ లో మహేష్ బాబు ఎటువంటి డూప్ లేకుండా నిజమైన మంటల్లో నటించలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మొదట ఇలా నటించడానికి మహేష్ బాబు నో చెప్పినట్లు.. తరవాత స్టోరీ విని చేస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.  మరి ఈ సమాచారం ఎంతవరకు నిజమో చూడాలి మరి. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం. వీరిద్దరి కాంబోలో తెరకెక్కనున్న SSMB29పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకు టాలీవుడ్ అందగాడు.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ ట్రెండ్ సెట్ చేస్తాడో చూడాలి మరి..


మరింత సమాచారం తెలుసుకోండి: