టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతి వస్తున్నాం మూవీ హ్యాట్రిక్ కొట్టేసింది. ఈ సినిమాలో హీరోయిన్లు గా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. బ్లాక్‌బస్టర్ లక్ష్మి కోసం వెంకటేష్‌తో కలిసి పని చేసిన రమణ గోగుల ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ సింగిల్‌కి తన వాయిస్ ని అందించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా 'సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా గ్రాండ్ రిలీజ్‌ అయిన విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమాకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ప్రమోషన్ లో దుమ్ము లేపిన ఈ చిత్రం.. ఇప్పుడు రిలీజ్ అయ్యి కూడా దుమ్ము లేపుతుంది. ఈ సినిమా సంక్రాంతి హిట్ అయ్యి.. రూ. 106 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటింది. ఇక ఈ సినిమా మెయిన్ టార్గెట్ ఫ్యామిలీ ఆడియన్స్ అవ్వడంతో సినిమా దూసుకుపోతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ మూవీని తెగ చూసేస్తున్నారు. ఈ మూవీకి బ్లాక్‌ బస్టర్‌ హిట్ టాక్ రావడంతో.. ఇటీవల హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ను కూడా సెలబ్రేట్‌ చేసుకున్నారు.
అయితే ఆ మీట్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సీక్వెల్ ఉంటుందని తెలిపారు. సంక్రాంతికి వస్తున్నాం - 2 కథ అక్కడి నుంచే మొదలవుతుందని క్లారిటీ ఇచ్చారు. మళ్లీ సంక్రాంతికే వస్తామని అన్నారు. ఈ సినిమా చేసేందుకు స్పేస్ ఉందని.. రాజమండ్రిలో ఎండ్‌ చేశాం కాబట్టి.. అక్కడి నుంచే ఈ కథ మొదలవుతుందని అన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మరో మిరాకిల్‌తో మీ ముందుకు వస్తామని అనిల్ రావిపూడి స్పష్టం చేశారు. దీంతో వెంకీ మామ ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: