తెలుగు సినీ పరిశ్రమలో వినోదాత్మక కథన శైలితో మరియు కుటుంబ ప్రేక్షకులకు అనుకూలమైన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.ఆయన రచన శైలిలో హాస్యానికి ప్రత్యేక స్థానంతో పాటు ప్రతి సినిమాలో కొత్తదనం ఉండేలా ప్రయత్నిస్తారు.అయితే ఈ సంక్రాంతికి డైరెక్టర్ అనిల్ వెంకటేష్తో 'సంక్రాతికి వస్తున్నాం' సినిమాతో బాలయ్య,రాంచరణ్ కు ధీటుగా ఎదురెళ్లి మరీ మంచి హిట్ అందుకున్నారు.అయితే విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో,దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన కామెడీ శైలిని ప్రదర్శించి అలరించారు.'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా సంక్రాంతి బరిలో నిలబడి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నందుకు ఈ మూవీ విడుదల అయినా నుండి ఒక్క నార్త్ అమెరికాలోనే 1.9మిలియన్ గ్రాస్ రాబట్టిందంటే మాములు విషయం కాదనే చెప్పాలి. ఈసంక్రాంతికి వచ్చిన మూవీల్లో నిజంగా బ్లాక్ బస్టర్ పొంగలు అనే చెప్పాలి.అయితే డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు ఆ మూవీ సీక్వెల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అయితే మూవీ రిలీజై దూసుకుపోతున్న సందర్భంగా జరిగిన బ్లాక్‌బస్టర్ మ్యూజికల్ నైట్‌లో అనిల్ మాట్లాడుతూ బ్రాహ్మరధం పడ్తున్న ప్రేక్షకులకు  కృతజ్ఞతలు తెలిపారు.అయితే అనిల్ ఇచ్చిన  ఇంటర్వ్యూలో ఈ సినిమా సీక్వెల్‌కు 'మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం' అనే పేరుకూడా సూచించిన్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ కథను రాజమండ్రిలో స్టార్ట్ చేసి ఇద్దరి ఆడోళ్ళ మధ్య నలిగే హీరోగా వెంకటేష్ చేత హాస్యాన్ని పండించడానికి సిద్ధంగా ఉన్నామని అనిల్ అన్నారు. అయితే అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే సంక్రాంతికి 'మళ్ళా సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్తో వస్తాం అని అన్నారు.అలాగే, కథలో ఇంకా చెప్పాల్సిన అంశాలు ఉన్నాయని మొత్తం మీద డైరెక్టర్ అనిల్ గారు సీక్వెల్ పై స్పష్టమైన క్లారిటీ ఇవ్వడం వల్ల ప్రేక్షకులు ఈ సీక్వెల్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: