మీనాక్షి చౌదరి.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్లలో ఈ హీరోయిన్ పేరు కూడా టాప్ లోకి వెళ్ళిపోయింది.. గత ఏడాది లక్కీ భాస్కర్,మెకానిక్ రాకి,ది గోట్, మట్కా వంటి సినిమాలతో స్టార్డం సంపాదించింది. ఇక మట్కా సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మ ది గోట్,లక్కీ భాస్కర్ వంటి రెండు సినిమాలతో అటు తమిళం, ఇటు తెలుగు రెండు ఇండస్ట్రీలలో వరుస అవకాశాలు అందుకుంది.అలా ఈ ఏడాది మొదట్లోనే మీనాక్షి చౌదరికి బిగ్గెస్ట్ హిట్ పడింది. సంక్రాంతి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ లవర్ పాత్రలో నటించిన మీనాక్షి చౌదరి నటనకి మంచి మార్కులు పడ్డాయి.అయితే అలాంటి మీనాక్షి చౌదరి సంక్రాతికి వస్తున్నాం సినిమాకి సంబంధించి ప్రమోషనల్ ఈవెంట్ లో తన లవ్ స్టోరీ రివీల్ చేసింది. మరి ఇంతకీ మీనాక్షి చౌదరి ప్రేమించింది ఎవరినో ఇప్పుడు తెలుసుకుందాం..

 సహజంగా చాలామంది సెలబ్రిటీలు ఇండస్ట్రీకి రాకముందే ఎవరో ఒకరితో ప్రేమలో పడి ఉంటారు.అలా మీనాక్షి చౌదరికి కూడా ఫస్ట్ క్రష్ ఫస్ట్ లవ్ అనేది ఉందట.మరి ఇంతకీ మీనాక్షి చౌదరి ఎవరిని ప్రేమించిందో తెలిస్తే మీరంతా నవ్వుకుంటారు. ఎందుకంటే మీనాక్షి చౌదరి ప్రేమించింది క్లాస్మేట్ నో లేక ఇంటి పక్కన అబ్బాయినో కాదు క్లాస్ టీచర్ ని.. అవును మీరు వినేది నిజమే.. స్కూల్ డేస్ లో ఉన్న సమయంలోనే మీనాక్షి చౌదరి తన క్లాస్ టీచర్ ని చాలా ఇష్టపడేదట.అంతేకాదు ఆయన అంటే నాకు చెప్పలేని క్రష్ అని, నా ఫస్ట్ క్రష్ ఆయనే అంటూ మీనాక్షి చౌదరి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

 ఆయన్ని చూస్తే ఏదో తెలియని ఫీలింగ్ కలిగేదని,అప్పట్లోనే ఆయన నాకు క్రష్ అంటూ మీనాక్షి చౌదరి చెప్పడం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.. అయితే మీనాక్షి చౌదరి లాగే చాలా మంది సెలబ్రేటీస్ స్కూల్ డేస్ లో టీచర్ పై ఇష్టం పెంచుకున్నట్లు ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలలో బయటపెట్టారు. ఇక మీనాక్షి చౌదరి ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి హీరోగా వస్తున్న అనగనగా ఒక రాజు సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకుంది. అయితే మొదట్లో ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను అనుకున్నప్పటికీ ఆమె తప్పుకోవడంతో ఆ అవకాశం మీనాక్షి చౌదరికి వచ్చింది. అలా ఈ ఏడాది కూడా మీనాక్షి చౌదరి తన హవా కొనసాగించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: