ప్రస్తుతం బాలీవుడ్ మొత్తం సైఫ్ అలీఖాన్ కి సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే కత్తి దాడికి గురయ్యారో అప్పటినుండి ఆయనపై ఎన్నో వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఆయన గురించి తెలియని సీక్రెట్ విషయాలు కూడా బయటపడుతున్నాయి.అయితే తాజాగా సినీ నటుడు సైఫ్ అలీ ఖాన్ కి దివంగత రాజకీయ నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైయస్ షర్మిల కి మధ్య ఉన్న సంబంధం మీకు తెలుసా అంటూ సోషల్ మీడియా ఓ వార్త వినిపిస్తుంది.మరి ఇంతకీ అసలు సినిమాలతో సంబంధంలేని వై ఎస్ షర్మిల కు, సైఫ్ అలీఖాన్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. 

సైఫ్ అలీ ఖాన్ తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడి పెద్ద క్రికెటర్ అనే సంగతి మనకు తెలిసిందే.ఆయన అప్పటి బాలీవుడ్ నటి అయినటువంటి షర్మిలా ఠాకూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఇక షర్మిలా ఠాకూర్ ఇప్పటి జనరేషన్ వాళ్లకు అంతగా తెలియకపోవచ్చు. కానీ అప్పట్లో ఎంతో మందికి షర్మిల ఠాకూర్ కలల రాకుమారి.. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మను సైఫ్ అలీఖాన్ తండ్రి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక అప్పట్లో షర్మిల ఠాకూర్ అందానికి ఎంతోమంది అబ్బాయిలు ఫీదా అయ్యేవారట. అలా షర్మిల ఠాకూర్ కి ఫిదా అయిన అబ్బాయిలలో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఒకరట..అవును మీరు వినేది నిజమే..

వైయస్ రాజశేఖర్ రెడ్డి కి హీరోయిన్ షర్మిలా ఠాకూర్ అంటే చెప్పలేనంత ఇష్టమట.షర్మిల ఠాకూర్ కి వైయస్ రాజశేఖర్ రెడ్డి వీరాభిమాని అని తెలుస్తుంది. ఇక తన అభిమాన హీరోయిన్ మీద ఉన్న ప్రేమతో వైయస్ రాజశేఖర్ రెడ్డి తన కూతురుకు కూడా షర్మిల అని పేరు పెట్టుకున్నారట.అలా సౌత్ ఇండియాలో షర్మిల అనే పేరు ఎక్కువగా వినిపించదు. కానీ వైయస్ రాజశేఖర్ రెడ్డి తన అభిమాన హీరోయిన్ పేరుని కూతురికి గుర్తుగా పెట్టుకోవడంతో వైయస్ షర్మిల కి సైఫ్ అలీ ఖాన్ కి మధ్య విచిత్రమైన అనుబంధం ఏర్పడిందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: