బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలలో అఖండ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు.. ఈ సినిమా అయిపోయినప్పటి నుంచి సిక్వెల్ అనౌన్స్మెంట్ చేస్తే చూడాలని అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. ఎట్టకేలకు అఖండ 2 రాబోతుందనే విషయాన్ని చిత్ర బృందం ప్రకటించింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న బాలయ్య మంచి విజయాలను అందుకుంటు ఉన్నారు. ఈసారి కూడా అఖండ 2 లో బాలకృష్ణ ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారట. ముఖ్యంగా సనాతన ధర్మం గురించి, హిందూ సాంప్రదాయాల గురించి ఇందులో కొన్ని సన్నివేశాలు ఉండబోతున్నాయట.


ఇటీవలే యూపీలో ప్రారంభమైన మహాకుంభమేళలో వెళ్లి అక్కడ కొన్ని సన్నివేశాలను కూడా షూటింగ్ చేసినట్లు సమాచారం. అఖండ 2 లో కుంభమేళకు సంబంధించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకొని ఎలా ఉంటాయని అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయని తెలుపుతున్నారు. అయితే ఈ చిత్రంలో ఒక సన్యాసి (ఆఘోర) పాత్రలో కీలకమని ఇందుకోసం అలనాటి హీరోయిన్ ని ఎంపిక చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు ప్రముఖ నటి శోభన.


ఇటీవలే ప్రభాస్ నటించిన కల్కి చిత్రంలో కూడా ఈమె కీలకమైన పాత్రలోనే నటించింది. అప్పట్లో హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించిన శోభన ఈ మధ్యకాలంలో కథలు ఎంపిక విషయంలో ప్రాధాన్యత ఉండే పాత్రలోనే నటిస్తోంది. బాలయ్య చిత్రానికి సంబంధించి డైరెక్టర్ బోయపాటి శ్రీను చెప్పిన పాత్ర కూడా ఈమెకు బాగా నచ్చడంతో ఓకే చెప్పిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి చిత్ర బృందం అధికారికంగా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. గతంలో బాలయ్య బోయపాటి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలన్నీ కూడా మంచి విజయాలని అందుకున్నాయి. ఇప్పుడు అఖండ 2 సినిమాపై కూడా భారీగానే అభిమానులకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ ఏడాది దసరా కానుకగా ఈ సినిమాని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: