చాలామందికి చాలా రకాల సెంటిమెంట్లు ఉంటాయి. అలా సినీ సెలెబ్రెటీలకు,రాజకీయ నాయకులకు కూడా కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. అయితే అలా సెంటిమెంట్లు ఉన్నవారిలో బాలకృష్ణ కూడా ఒకరు.. బాలకృష్ణ ఎక్కువగా జాతకాలు,జ్యోతిష్యం వంటివి నమ్ముతూ ఉంటారు.ఆయన తన సినిమాకి సంబంధించి ఈవెంట్ అయినా లేదా రాజకీయాలైనా సరే జ్యోతిష్యుడిని అడిగే జాతకం చూయించుకొని చేస్తారట. అలాంటి బాలకృష్ణ కి ఒక కలర్ డ్రెస్ అస్సలు కలిసి రాదట. అవును ఈ విషయాన్ని స్వయంగా బాలకృష్ణనే చెప్పారు.మరి ఇంతకీ బాలకృష్ణకు కలిసి రాని ఆ కలర్ డ్రెస్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది.

అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో బాలకృష్ణ మాట్లాడుతూ.. నాకు ఆదివారం రోజు నలుపు రంగు దుస్తులు వేసుకుంటే అస్సలు కలిసి రాదు.. నేను తెలిసి కూడా ఓ ఆదివారం రోజు నలుపు రంగు దుస్తులు వేసుకొని షూటింగ్ కి వెళ్లాను. దాంతో నా నడుము విరగ్గొట్టుకున్నాను. నేను మూలా నక్షత్రంలో పుట్టాను. అందుకే నాకు నలుపు రంగు డ్రెస్ కలిసి రాదు అని, ఆదివారం రోజు నలుపు రంగు వేసుకోకూడదని జ్యోతిష్యుడు చెప్పాడు.కానీ ఆదిత్య 369 సినిమా షూటింగ్ జరుగుతున్న రోజు బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకోకూడదు అని తెలిసినా కూడా ఆదివారం రోజు అదే బ్లాక్ డ్రెస్ వేసుకొని షూటింగ్ కి వెళ్లాను. ఇక ఆరోజు నేను భయపడుకుంటూనే షూటింగ్ కి వెళ్లాను ఈరోజు ఏం జరుగుతుందో అని.. కానీ ఆరోజు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చూస్తుండగానే నా నడుము విరిగింది.

 ఇక అప్పటివరకు ఆదిత్య 369 సినిమాకి నిర్మాతగా చేసిన ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు షూటింగ్ కి రాలేదు.కానీ ఆయన ఆరోజే ఫస్ట్ టైం వచ్చారు. ఆయన వచ్చిన రోజే నా నడుము విరగడంతో నేను రావడం వల్లే అలా జరిగింది కావచ్చు అని భయపడ్డారు. అప్పటినుండి ఆయన షూటింగ్ కి రావడం కూడా మానేశారు. అలా ఆదివారం నాకు నలుపు రంగు కలిసి రాదు అనడానికి ఇదే నిదర్శనం అంటూ బాలకృష్ణ చెపుకొచ్చారు. ఇక అదే ఇంటర్వ్యూలో బాలకృష్ణ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఉండే మేమందరం చాలా జెన్యూన్ గా ఉంటాం. గోరంత దాన్ని కొండంత చేసి చెప్పుకోం. అలాంటి సంస్కృతి మాకు లేదు. అలాగే నాకు వచ్చిన రికార్డులన్నీ అన్ స్టాపబుల్ అంటూ బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: