టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో వరుణ్ తేజ్ ఒకరు. వరుణ్ తేజ్ కెరీర్ తొలినాళ్లలో నటించిన ఫిదా, తొలిప్రేమ, ఎఫ్2, ఎఫ్3, కంచె సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్లుగా నిలిచాయి. అయితే ఈ మధ్య కాలంలో వరుణ్ తేజ్ ఖాతాలో సరైన సక్సెస్ లేదనే సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ కు మాస్ సినిమాల కంటే క్లాస్ సినిమాలే బెటర్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
మాస్ సినిమా అయిన గద్దలకొండ గణేష్ తో సక్సెస్ సాధించినప్పటికీ మెజారిటీ సందర్భాల్లో వరుణ్ తేజ్ కు ఆశించిన ఫలితాలు దక్కలేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సక్సెస్ లో ఉన్న డైరెక్టర్లకు వరుణ్ తేజ్ ఛాన్స్ ఇస్తే బాగుంటుందని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వరుణ్ తేజ్ కెరీర్ గ్రాఫ్ అంతకంతకూ పెరగాలని సినీ అభిమానులు భావిస్తున్నారు.
 
వరుణ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వరుణ్ తేజ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని పాన్ ఇండియా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. వరుణ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తారేమో చూడాల్సి ఉంది. స్టార్ హీరో వరుణ్ తేజ్ క్రేజ్ మాత్రం మామూలుగా లేదు.
 
వరుణ్ తేజ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 7 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. వరుణ్ తేజ్ తర్వాత సినిమా మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో తెరకెక్కనుంది. ఈ మధ్య కాలంలో మేర్లపాక గాంధీకి కూడా భారీ విజయాలు దక్కడం లేదనే సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. వరుణ్ సక్సెస్ ట్రాక్ లోకి రప్పించే ప్రాజెక్ట్ లను ఎంచుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: